Heath Devis | నేను గే: న్యూజిలాండ్ మాజీ పేసర్ సంచలన ప్రకటన
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ తాను స్వలింగ సంపర్కుడినని సంచలన ప్రకటన చేశాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలకమైన విషయాలను అతడు తాజాగా ఓ ఆన్లైన్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను ‘గే’ అనే విషయం ఆక్లాండ్ (న్యూజిలాండ్‌లో దేశవాళీ జట్టు) క్రికెట్లో అందరికీ తెలుసునని, వాళ్లు తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని వ్యాఖ్యానించాడు.
‘ది స్పిన్ఆఫ్’తో డెవిస్ ముచ్చటిస్తూ.. ‘ఇన్నాళ్లు ఈ విషయాన్ని దాచిపెడుతున్నానని నేను భావించాను. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరముంది. కానీ నాకెందుకో దీనిని దాచిపెట్టాలని అనిపించలేదు. బయటి ప్రపంచానికి చెప్పాలనుకున్నా. అవును, నేను గే. ఆక్లాండ్ జట్టులో అందరికీ ఈ విషయం తెలుసు. కానీ వాళ్లకు ఇది ఎన్నడూ ఒక సమస్య కాలేదు. నా స్వేచ్ఛకు వాళ్లు భంగం కలిగించలేదు..’ అని తెలిపాడు.
కాగా అంతర్జాతీయ క్రికెట్లో తాను గే అని చెప్పుకున్న రెండో క్రికెటర్ డెవిస్. 2011లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ స్టీవెన్ డెవిస్ తాను స్వలింగ సంపర్కుడినని ప్రపంచానికి చెప్పాడు. మహిళల క్రికెట్లో పలువురు ఆటగాళ్లు ఇప్పటికే తాము ‘లెస్బియన్’ అని ప్రకటించడమే కాకుండా పెళ్లిల్లు కూడా చేసుకున్నారు. కానీ పురుషుల క్రికెట్లో తాము గే అని ప్రకటించుకున్నవాళ్లు పైన పేర్కొన్న ఇద్దరే. న్యూజిలాండ్ క్రికెట్ విషయానికొస్తే.. ఇలా ప్రకటించిన తొలి కివీస్ ఆటగాడు డెవిస్.
1994 నుంచి 1997 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన డెవిస్.. ఆ జట్టు తరఫున 5 టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. టెస్టులలో 17, వన్డేలలో 11 వికెట్లు పడగొట్టాడు. వరుసగా గాయాలు, నిలకడలేమి కారణంగా డెవిస్ జట్టులో చోటు కోల్పోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- gay
- Heath Devis
- New Zealand
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

