Manjot Kalra: భారత అండర్-19 మాజీ క్రికెటర్ మన్జోత్ కల్రా (Manjot Kalra) అరెస్టయ్యాడు. లంచం కేసులో అతడిని శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లంక ప్రీమియర్ లీగ్(LPL)లో ఆటగాళ్లకు రూ.27 లక్షలు లంచం ఇచ్చేందుకు మన్జోత్ ప్రయత్నించాడని, అందుకే.. అతడిని అరెస్ట్ చేశారని సమాచారం. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మన్జోత్ నుంచి మరిన్ని విషయాలు రాబట్టే పనితో ఉంది. ఎల్‌పీఎల్‌లోని జాఫ్నా కింగ్స్(Jaffna Kings) జట్టుకు సహ యజమానిగా ఉన్న అతడిపై స్క్వాడ్‌లోని ఆటగాళ్లే ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఒకప్పుడు భారత జెర్సీతో అదరగొట్టిన మన్జోత్ కల్రా ఇప్పుడు అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. శ్రీలంక టీ20 లీగ్‌లో జాఫ్నా కింగ్స్ జట్టు సహ యజమానిగా ఉన్న మన్జోత్ ఆటగాళ్లకు లంచం ఇవ్వబోయాడని పలువురు క్రికెటర్లు ఫిర్యాదు చేయడమే అందుకు కారణం. జాఫ్నా కింగ్స్ స్క్వాడ్‌లోని భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లలాగే పోలీసులకు అతడిపై కంప్లైంట్ ఇచ్చారు.
🚨 REPORTS 🚨
Former India U-19 World Cup winner and Jaffna Kings co-owner Manjot Kalra has been arrested by the Sri Lankan police over an alleged match-fixing approach made by a player.
(Source: NewsWire)#LPL2026 #SriLanka #Sportskeeda pic.twitter.com/lfWmhXrBix
— Sportskeeda (@Sportskeeda) July 17, 2026
ఓ ఆటగాడికి రూ.27 లక్షలు (శ్రీలంక కరెన్సీలో 9.5 మిలియన్స్) ఇచ్చేందుకు మన్జోత్ సిద్ధపడ్డాడని క్రికెటర్లు పోలీసులకు తెలిపారు. దాంతో, కొలంబోలోని హోటల్లో అతడిని వారు అదుపులోకి తీసుకున్నారు. ఐదు జట్లు.. 24 మ్యాచులతో సాగే లంక ప్రీమియర్ లీగ్ ఆగస్టు 8న ముగియనుంది.
ఢిల్లీలో జన్మించిన మన్జోత్ కల్రా.. దేశవాళీ క్రికెట్లో మెరిసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2018 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై శతకంతో మెరిసిన మన్జోత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డూ అందుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన అతడిపై బీసీసీఐ నిషేధం విధించింది.
Former India U-19 World Cup winner Manjot Kalra arrested in Sri Lanka
D: https://t.co/HxUyvM6Vig pic.twitter.com/iiIomyXj1t
— NewsWire 🇱🇰 (@NewsWireLK) July 17, 2026
అండర్-16, అండర్-19లో ఆడేందుకు మన్జోత్ తన వయసు తప్పుగా చూపినందుకు అతడిపై వేటు పడింది. దాంతో, భారత్‌లో ఆడే పరిస్థితులు లేకపోవడంతో అతడు స్పోర్ట్స్ ఆంత్రోప్రెన్యూర్‌గా మారాడు. లంక ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఆరంభానికి ముందు మన్జోత్ జాఫ్నా కింగ్స్ యాజమాన్యంలో ఒకడిగా చేరాడు.