Asad Rauf | ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన క్రికెటర్, అంపైర్.. ఇప్పుడు చెప్పులు అమ్ముకుంటూ..
‘ఓడలు బండ్లు అవుతై.. బండ్లు ఓడలు అవుతై’ అనేదానికి నిదర్శనమా అన్నట్టుగా తయారైంది పాకిస్తాన్ మాజీ అంపైర్ అసద్ రవుఫ్ పరిస్థితి. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ లో అంపైర్ గా ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు పాకిస్తాన్ లోని లాహోర్ లో బట్టలు, చెప్పుల దుకాణం నడుపుతున్నాడు.
2000 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ లో అంపైర్ గా కొనసాగిన ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్.. ప్రస్తుతం జీవనం కోసం బట్టలు, బొమ్మలు, షూస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో అసద్.. 49 టెస్టులు, 98 వన్డేలు, 23 టీ20లకు అంపైర్ గా వ్యవహరించాడు.
తన ప్రస్తుత స్థితిపై అసద్ పాకిస్తాన్ కు చెందిన పాక్ టీవీ.టీవీతో మాట్లాడాడు. తాను అంపైర్ గా వైదొలిగినప్పట్నుంచి మళ్లీ క్రికెట్ వైపునకు చూడలేదని, తనకు దీనిలోనే సంతోషం ఉందని తెలిపాడు. ‘నేను నా కెరీర్ లో చాలా మ్యాచులకు అంపైరింగ్ చేశాను. ఇక నేను అక్కడ కొత్తగా చూడాల్సిందేమీ లేదు. 2013 నుంచి నేను మళ్లీ ఆ వైపు చూడలేదు. ఎందుకంటే నేనొక్కదానిని వదిలిపెడితే మళ్లీ జీవితంలో దాని ముఖం చూడను..’ అని వ్యాఖ్యానించాడు.
66 ఏండ్ల ఈ పాకిస్తానీ అంపైర్ పై గతంలో స్పాట్ ఫిక్సింగ్ తో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయి. 2013 ఐపీఎల్ లో బుకీల దగ్గర డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డాడని బీసీసీఐ ఆరోపించింది. దీంతో ఐసీసీ అతడిపై ఐదేండ్ల నిషేధం విధించింది. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అతడి కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోయింది. అంతేగాక.. 2012లో ముంబైకి చెందిన ఓ మోడల్ ను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడా ఆరోపణలున్నాయి.
వీటిపై అసద్ స్పందిస్తూ.. ‘నేను ఐపీఎల్ లో చాలా ఎంజాయ్ చేశాను. ఆ ఆరోపణ (స్పాట్ ఫిక్సింగ్)లతో నాకు సంబంధం లేదు. ఆ ఆరోపణలు చేసింది బీసీసీఐ. వాళ్లు దానిమీద నిర్ణయం తీసుకున్నారు. ఇక మహిళపై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా నేను 2013 ఐపీఎల్ సీజన్ లో అంపైరింగ్ చేశాను..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
— M.S. Mir (@SaadKapital2) June 23, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

