Ashish Nehra | క్రికెట్లో ఫుట్‌బాల్ కోచ్.. ఇలా ఉన్నా ఫలితాలు రాబట్టొచ్చంటున్న ఆశిష్ నెహ్రా
తల మీద బ్యాక్ క్యాప్. ఒంటిమీద ఓ టీషర్ట్, 2/3 నిక్కరు. చేతిలో పెన్నూ పేపర్. పేరుకు హెడ్‌కోచ్ అయినా డగౌట్లో కనిపించిన దాఖలాల్లేవు. నిత్యం బౌండరీ లైన్ చుట్టూ అటూ ఇటూ ప్రదిక్షణలు చేస్తూ ఓ చోట కుదురుగా ఉండని మనిషి.
Ashish Nehra | తల మీద బ్యాక్ క్యాప్. ఒంటిమీద ఓ టీషర్ట్, 2/3 నిక్కరు. చేతిలో పెన్నూ పేపర్. పేరుకు హెడ్‌కోచ్ అయినా డగౌట్లో కనిపించిన దాఖలాల్లేవు. నిత్యం బౌండరీ లైన్ చుట్టూ అటూ ఇటూ ప్రదిక్షణలు చేస్తూ ఓ చోట కుదురుగా ఉండని మనిషి. ఆకలైతే కొబ్బరి బొండంలో స్ట్రా వేసుకుని కూల్‌గా తాగుతూ కనిపించే ఆ వ్యక్తి.. మూడు సీజన్లుగా గుజరాత్ టైటాన్స్ తలరాతను రాస్తున్నాడు.
‘క్రికెట్లో కోచ్ అంటే ఇలాగే ఉండాలి’ అన్న ప్రాథమిక సూత్రాలను చించి డస్ట్ బిన్లో పారవేసి ‘ఇలా ఉన్నా ఫలితాలు రాబట్టొచ్చు’ అంటూ కోచింగ్‌కు కొత్త అర్థం చెబుతున్నాడు. కోచ్ అంటే సలహాలిచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. ఆటగాళ్లతో కలిసిపోవడం అన్న ప్రాథమిక సూత్రాన్ని ఒంటబట్టించుకుని ‘క్రికెట్లో ఫుట్‌బాల్ కోచ్’ అంటూ ప్రశంసలు పొందుతున్నాడు. అతడెవరో కాదు. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.
- ‘ప్రొఫెషనల్ గేమ్’గా అభివర్ణించే క్రికెట్లో కోచ్‌లు వ్యవహరించే తీరూ ఆ పేరుకు తగ్గట్టే ఉంటుంది. డగౌట్లలో టీవీ స్క్రీన్ల ముందు కూర్చుని మ్యా చ్‌ను చూస్తూ, సహచర కోచింగ్ సిబ్బందితో ఏవేవో లెక్కలేసుకుంటూ అప్పుప్పుడూ ఆటగాళ్లకు నేరుగా లేదా ఇతర ఆటగాళ్ల ద్వారా సూచనలు, సలహాలు అందిస్తూ కనబడుతుంటారు. కానీ గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ నెహ్రా మాత్రం ఈ పాతచింతకాయ పచ్చడి విధానాన్ని పక్కన పడేశాడు. క్రికెట్లో ఫుట్‌బాల్ తరహా కోచింగ్‌ను పరిచయం చేశాడు.
- ఫుట్‌బాల్‌లో మేనేజర్లుగా వ్యవహరించే కోచ్‌లు.. నిత్యం ఆటగాళ్లతో గ్రౌండ్ చుట్టూ పరుగులు పెడుతుంటారు. అప్పటికప్పుడే వ్యూహాలను సిద్ధం చేసుకుని ప్రత్యర్థి ఎత్తుల్ని చిత్తు చేస్తూ వాటిని పక్కాగా అమలుపరుస్తారు. ఆటగాళ్లతో పాటే పరుగులు పెడతారు. ప్లేయర్స్ రిప్లేస్మెంట్, ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకుంటారు. నెహ్రా కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ క్రికెట్లో కోచ్‌లు ఏదైనా అవసరం వస్తే తమకు పెద్దగా పనిలేదనుకుని ‘స్లీప్ మోడ్’లో ఉంటే నెహ్రా మాత్రం ‘ఎనీ టైమ్.. యాక్టివ్ మోడ్’ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. నెహ్రా కోచింగ్ ైస్టెల్ చూసి అభిమానులు అతడిని ప్రీమియర్ లీగ్‌లో ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు అయిన మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలతో పోలుస్తున్నారు.
- ఈ సీజన్లో గుజరాత్ కొత్త సారథి శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా తో రెండు సీజన్ల పాటు అద్భుతాలు రాబట్టిన నెహ్రా.. అంతగా అనుభ వం లేని గిల్‌తోనూ అదే మ్యాజిక్‌ను పునరావృతం చేస్తున్నాడు. గుజరాత్ ఫీల్డింగ్ చేస్తున్నంతసేపూ బౌండరీ లైన్ చుట్టూనే ప్రదిక్షణలు చేస్తూ టీమ్‌కు ‘షాడో కెప్టెన్’గా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులు రాబడుతుంటే వాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు అప్పటికప్పుడే వ్యూహాలు రూపొందించి వాటిని బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ల ద్వారా గిల్‌కు చేరవేస్తున్నాడు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌లోనూ ఇదే చర్చ. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నెహ్రా ఖాళీగా ఉండటం చాలా అరుదు. ఎప్పుడూ తన పక్కనుండే ప్లేయర్లు, కోచ్‌లతో ఏదో ఒకటి సంభాషిస్తూనే ఉంటాడు. గుజరాత్ కోచింగ్ టీమ్‌లో గ్యారి కిర్‌స్టెన్, విక్రమ్ సోలంకి, మిథున్ మన్హస్, ఆశిన్ కపూర్, నరేందర్ నేగి వంటి వాళ్లు ఉన్నా వాళ్లు కనబడిన దాఖలాలు తక్కువ.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

