Football Association | కొత్త పెనాల్టీ రూల్స్ తేనున్న ఫుట్‌బాల్ అసోసియేషన్.. అర్జెంటీనా గోల్ కీపర్ ప్రవర్తనే కారణమా..?
గోల్ కీపర్ల దుందుడుకు చర్యలను నియంత్రించడం కోసం అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ త్వరలోనే పెనాల్టీ రూల్స్‌ను మార్చనుంది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ చేష్టలను తీవ్రంగా పరిగణించిన ఫుట్‌బాల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
Football Association : అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ త్వరలోనే కొత్త పెనాల్టీ నియమాలను ప్రవేశపెట్టనుంది. గోల్ కీపర్ల దుందుడుకు చర్యలను నియంత్రించడం కోసం రూల్స్‌ను మార్చనుంది. మార్చిలో లండన్‌లో జరగనున్న వార్షిక సమావేశంలో కొత్త నియమాలకు ఆమోదం తెలపనుంది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ తీరును ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో పెనాల్టీ షూటౌట్‌కు ప్రయత్నించిన ఫ్రాన్స్ ఆటగాళ్లను మార్టినెజ్ తన చేష్టలతో దారి మళ్లించాడు. ఫ్రాన్స్ ప్లేయర్ కింగ్స్లే కొమాన్ను, మార్జినేజ్ కాసేపు నిరీక్షించేలా చేశాడు. రిఫరీతో మాట్లాడమే కాకుండా బంతి పెనాల్టీ స్పాట్లో ఉందా? లేదా? అనేది చెక్ చేయాలని కోరాడు. అంతేకాదు అరెలిన్ చౌమనితో మైండ్ గేమ్ ఆడాడు. దాంతో, ఆ జట్టు పెనాల్టీ షూటౌట్లో విఫలమైంది. అయితే.. అర్జెంటీనా జట్టు ఫిఫా నియమావళిని ఉల్లంఘించిందని మ్యాచ్ అనంతరం ఫిఫా వెల్లడించింది.
గోల్డెన్ గ్లోవ్తోనూ అసభ్యకరంగా..
ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2తో ఫ్రాన్స్‌పై గెలుపొందింది. మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపేను గోల్డెన్ బూట్ అవార్డు వరించింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ గోల్డెన్ గ్లోవ్ అందుకున్నాడు. గ్లోవ్ అందుకున్నాక అతను అసభ్యకరంగా ఫొటోలకు పోజులిచ్చాడు. దాంతో, అతనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

