ఉరుగ్వే, దక్షిణ కొరియా జట్ల మధ్య ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరుజట్ల ఆటగాళ్లు కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. ఉరుగ్వే ఆటగాళ్లు రెండు సార్లు గోల్ కోసం ప్రయత్నించారు. రెండో అర్థభాగంలో గాడిన్, మ్యాచ్ కాసేపట్లో ముగుస్తుంది అనగా వల్వెర్డే గోల్ కొట్టడానికి చూశారు. కానీ, దక్షిణ కొరియా డిఫెన్స్ అడ్డుగా నిలవడంతో సాధ్యం కాలేదు. దక్షిణ కొరియా ఆటగాడు వాంగ్ యు జి కొట్టిన బంతి బార్ని తగలడంతో గోల్ కాలేదు.
మరో మ్యాచ్‌లో బెల్జియం జట్టు 1-0తో కెనడాను ఓడించింది. కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0తో గెలిచింది. ఈ రోజు పోర్చుగల్, ఘనా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దాంతో, అందరి కళ్లన్నీ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపైనే ఉన్నాయి.