FIFA World Cup | ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. పై చేయి ఎవరిదంటే..?
ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా 2, ఫ్రాన్స్ ఒక మ్యాచ్‌లో గెలిచాయి
FIFA World Cup : మరి కొద్ది గంటల్లో ఫిఫా ఫైనల్ మొదలుకానుంది. ట్రోఫీని ముద్దాడాలనే సమరోత్సాహంతో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు ఉన్నాయి. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాయే కీలకం కానున్నారు. వీళ్లిద్దరూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లు. ఈ టోర్నీలో 5 గోల్స్ చేసిన మెస్సీ, ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డు రేసులో ఉన్నారు. అందుకని ఈ మ్యాచ్‌లో ఎవరిది పై చేయి అవుతుందో ఊహించడం కష్టమే. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఫ్రాన్స్‌కు వరుసగా ఇది రెండో ఫైనల్. ఫైనల్లో ఎలా ఆడాలో ఆ జట్టుకు బాగా తెలుసు. కానీ, గత రికార్డులను పరిశీలిస్తే.. అర్జెంటీనా ఆధిపత్యం ప్రదరిస్తూ వచ్చింది. ఇరుజట్లు ముఖాముఖిగా తలపడడం ఇది 13వ సారి.
గతంలో 12 సార్లు ఢీ కొన్నాయి. అర్జెంటీనా అత్యధికంగా 6 మ్యాచుల్లో విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ 3 మ్యాచుల్లో గెలిచింది. మిగతా 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. అయితే ఫిఫా వరల్డ్ కప్‌లో మాత్రం రెండు టీమ్‌లు మూడు మ్యాచుల్లో ఎదరుపడ్డాయి. అర్జెంటీనా 2, ఫ్రాన్స్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించాయి.
అర్జెంటీనా 3-0తో క్రొయేషియాపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో సెమీఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోను చిత్తు చేసింది. 2018 వరల్డ్ కప్ ఫైనల్ ఫ్రాన్స్ 4-2తో క్రొయేషియాను చిత్తు చేసి టైటిల్ అందుకుంది. 2014లో ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా 0-1తో జర్మనీ చేతిలో ఓడిపోయింది. దాంతో, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ఉంది మెస్సీ టీమ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

