FIFA World Cup 2026 | కాంగోతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న పోర్చుగల్.. నిరాశపరిచిన రోనాల్డో
FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ K ఓపెనింగ్ మ్యాచ్‌లో బలమైన పోర్చుగల్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లోని హియూస్టన్ వేదికగా డీఆర్ కాంగోతో జరిగిన ఈ మ్యాచ్ 1-1 తో డ్రాగా ముగిసింది.
Cristiano Ronaldo | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ K ఓపెనింగ్ మ్యాచ్‌లో బలమైన పోర్చుగల్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లోని హియూస్టన్ వేదికగా డీఆర్ కాంగోతో జరిగిన ఈ మ్యాచ్ 1-1 తో డ్రాగా ముగిసింది. వరల్డ్ కప్‌లో కాంగో జట్టుకు ఇదే మొట్టమొదటి పాయింట్ కావడం విశేషం. మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషంలోనే పోర్చుగల్ యువ ఆటగాడు జోవావ్ నెవెస్ (João Neves) పెడ్రో నెటో అందించిన అద్భుతమైన క్రాస్‌ను హెడర్ ద్వారా గోల్‌గా మలిచి పోర్చుగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే తొలి సగం ముగిసే సమయానికి (Half time) కాంగో ఆటగాడు యోవాన్ విస్సా (Yoane Wissa) లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని హెడర్ ద్వారా గోల్ చేసి స్కోరును 1-1 తో సమం చేశాడు. దీంతో వరల్డ్ కప్ చరిత్రలో కాంగోకి తొలి గోల్ నమోదు అయ్యింది.
ఇక తన కెరీర్లో రికార్డు స్థాయిలో 6వ వరల్డ్ కప్ ఆడుతున్న పోర్చుగల్ స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రోనాల్డో ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. రోనాల్డో ఈ మ్యాచ్‌లో కేవలం 29 టచ్‌లు మాత్రమే సాధించాడు. అతని వరల్డ్ కప్ కెరీర్లోనే ఒక మ్యాచ్‌లో అత్యంత తక్కువగా ఇన్వాల్వ్ అయిన సందర్భాలలో ఇది ఒకటి. మ్యాచ్ సెకండ్ హాఫ్‌లో రోనాల్డోకు రెండు సులువైన గోల్స్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ, వాటిని అతడు గోల్‌గా మలచలేకపోయాడు. కాంగో డిఫెన్స్ అతడిని విజయవంతంగా కట్టడి చేసింది. ఇక పోర్చుగల్ జట్టు తదుపరి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

