FIFA World Cup 2026 | క్రోయేషియాపై ఇంగ్లాండ్ ఘన విజయం.. 4-2తో సూపర్ విక్టరీ!
England vs Croatia | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ L ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీమ్ అద్భుత ప్రదర్శన చేసింది. టెక్సాస్‌లోని డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో క్రోయేషియాపై 4-2 తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి తమ వరల్డ్ కప్ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది.
England vs Croatia | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ L ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీమ్ అద్భుత ప్రదర్శన చేసింది. టెక్సాస్‌లోని డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో క్రోయేషియాపై 4-2 తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి తమ వరల్డ్ కప్ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. కొత్త హెడ్ కోచ్ థామస్ తుచెల్ నేతృత్వంలో ఇంగ్లాండ్‌కు ఇది తొలి మేజర్ టోర్నమెంట్ విజయం.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ రెండు గోల్స్‌తో చెలరేగాడు. మ్యాచ్ 12వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి ఇంగ్లాండ్‌కు తొలి ఆధిక్యాన్ని అందించిన కేన్. ఆ తర్వాత 42వ నిమిషంలో హెడర్ ద్వారా మరో అద్భుత గోల్ చేశాడు. ఈ గోల్‌తో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వరల్డ్ కప్ గోల్స్ (10 గోల్స్) చేసిన గ్యారీ లినెకర్ రికార్డును కేన్ సమం చేశాడు.
మరోవైపు ఇంగ్లాండ్ డిఫెన్స్ లోపాలను వాడుకుంటూ క్రోయేషియా మొదటి సగంలో గట్టి పోటీనిచ్చింది. 36వ నిమిషంలో మార్టిన్ బాతురినా, ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి పెటార్ ముసా గోల్స్ చేయడంతో తొలి సగం ముగిసేసరికి స్కోరు 2-2 తో సమమైంది. ఇక రెండో సగంలో ఇంగ్లాండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. కోచ్ తుచెల్ ఇచ్చిన హాఫ్-టైమ్ స్పీచ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు తెలుస్తుంది. దీంతో సెకండ్ హాఫ్ ప్రారంభమైన కేవలం రెండు నిమిషాలకే (47వ నిమిషంలో) యువ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఇంగ్లాండ్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగియడానికి మరో ఐదు నిమిషాలు ఉందనగా (85వ నిమిషంలో), సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్కస్ రాష్‌ఫోర్డ్, బుకాయో సాకా అందించిన పాస్‌ను గోల్‌గా మలిచి ఇంగ్లాండ్ విజయాన్ని 4-2 తో ఖాయం చేశాడు. దీంతో దాదాపు 15 ఏండ్ల తర్వాత ఒక స్టార్ జట్టును ఇంగ్లాడు జట్టు మట్టికరిపించింది. ఇక ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఘనాతో, క్రోయేషియా జట్టు పనామాతో తలపడనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

