ఈ నెల 20న ఫిఫా వరల్డ్ కప్ మొదలుకానుండడంతోప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ మొదలైంది. కేరళలో కొందరు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్స్ మీద తమ అభిమానాన్నిప్రపంచానికి తెలియజేసేందుకు వెరైటీగా ఆలోచించారు. 30 అడుగుల ఎత్తైన లియొనెల్ మెస్సీ కటవుట్ ఏర్పాటు చేశారు. కోజికోడ్ జిల్లాలోని పుల్లవూర్ ఊరికి చెందిన కొందరు యువకులు అర్జెంటీనా ఫ్యాన్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో తమ ఫేవరెట్ టీం, ఫేవరెట్ అటగాడికి మద్దతుగా వాళ్లు కురున్గట్టు కడవు నది మధ్యలో మెస్సీ కటవుట్ పెట్టారు. ‘త్వరలో ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ ఈవెంట్‌ని మరింత స్పెషల్‌గా మార్చాలనుకున్నాం. అందుకోసం మెస్సీ నిలువెత్తు కటవుట్ పెట్టాం’ అని చెప్పాడు ఆషిక్ అహ్మద్ అనే అభిమాని. రోడ్డు మీదుగా మెస్సీ కటవుట్‌ని తీసుకొస్తున్న ఫొటోలు, వీడియోల్ని రిజ్వాన్ అనే యూజర్ ట్విట్టర్లో పెట్టాడు. దాంతో ఆ ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
Behind the Scene
Messi 💙🇦🇷#VamosArgentina 🇦🇷 pic.twitter.com/ySzaWQCn9y— rizwan_m.m (@Rlzw4n) October 31, 2022