ఫ్రాన్స్‌కు షాక్.. ట్యునీషియా చేతిలో ఓటమి
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. మేటి జట్లకు అనామక టీమ్‌లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నాకౌట్ దశ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లన్నీ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్నాయి.
- ప్రిక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా
- ఆసక్తికరంగా నాకౌట్ రేసు
- ఫిఫా ప్రపంచకప్
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. మేటి జట్లకు అనామక టీమ్‌లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నాకౌట్ దశ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లన్నీ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు ట్యునీషియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించామన్న అలసత్వంతో ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ను ట్యునీషియా అద్భుతంగా నిలువరించింది. డెన్మార్క్‌కు ఝలకిచ్చిన ఆస్ట్రేలియా ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 16 ఏండ్ల తర్వాత కంగారూలు నాకౌట్‌కు అర్హత సాధించారు. మొత్తంగా ఫిఫా టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది.
అల్ రయాన్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ వరుస విజయాలకు ఫుల్స్టాప్ పడింది.
బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ట్యునీషియా 1-0 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి వారెవా అనిపించింది. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత దక్కించుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ చేసిన ప్రయోగాలు దెబ్బతీశాయి. స్టార్ ప్లేయర్లు కలియన్ ఎంబాపె, అంటోని గ్రిజ్‌మన్‌కు విశ్రాంతినిచ్చిన ఫ్రాన్స్ ద్వితీయ శ్రేణి ప్లేయర్లకు పోటీకి దింపింది. ఇదే అదనుగా ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన ట్యునీషియా అద్భుత పోరాట పటిమ కనబర్చింది. ర్యాంకింగ్స్ పరంగా ఫ్రాన్స్ 4వ ర్యాంక్‌లో ఉంటే 30లో ఉన్న ట్యునీషియా ఉంది. ఇరు జట్లు ఆది నుంచే హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ ప్రథమార్ధం గోల్ లేకుండా ముగిసింది.
ద్వితీయార్థంలో ట్యునీషియా ప్లేయర్ వహ్బీ కజ్రీ(58ని) ఫ్రాన్స్ రక్షణ శ్రేణిని కంగుతినిపిస్తూ గోల్ కొట్టడంతో స్టేడియం ఒక్కసారిగా ఊగిపోయింది. ఇక్కణ్నుంచి తేరుకున్న ఫ్రాన్స్ తమ స్టార్ ఆటగాళ్లను దింపక తప్పని పరిస్థితి కొనితెచ్చుకుంది. ఆఖరి వరకు స్కోరును సమం చేసేందుకు ఫ్రాన్స్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. మ్యాచ్ అదనపు సమయంలో గ్రిజ్మన్ గోల్ కొట్టినా..ఆఫ్‌సైడ్ అని తేలడంతో ఫ్రాన్స్ బేజారు కాగా ట్యునీషియా సంబురాల్లో మునిగిపోయింది. 2014 తర్వాత ఫ్రాన్స్‌కు ఇది తొలి ఓటమి కాగా, ప్రపంచకప్‌లో ట్యునీషియాకు ఇది మూడో విజయం కావడం విశేషం.
16 ఏండ్ల తర్వాత
ఆస్ట్రేలియా 16 ఏండ్ల తర్వాత ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 1-0తో విజయం సాధించింది. ఆసీస్ తరఫున మాథ్యూ లెకీ(60ని) ఏకైక గోల్ అందించాడు. గ్రూపు-డి నుంచి ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ముందంజ వేయగా, ట్యునీషియా, డెన్మార్క్ నిష్క్రమించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

