RCB vs CSK : ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. 19 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన సీఎస్కే మరో వికెట్ పారేసుకుంది. డేంజరస్ అజింక్యా రహానే(33)ను ఫెర్గూసన్ వెనక్కి పంపాడు. ఓపెనర్ రచిన్ రవీంద్ర(39)తో కలిసి రహానే మూడో వికెట్‌కు 66 రన్స్ జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఫెర్గూసన్ విడదీసి ఆర్సీబీకి బ్రేకిచ్చాడు. 10 ఓవర్లకు చెన్నై స్కోర్.. 87/3. ఆ జట్టు విజయానికి ఇంకా 132 రన్స్ కావాలి.
రెండొందల ఛేదనలో చెన్నై స్టార్లు డారిల్ మిచెల్(4), రుతురాజ్ గైక్వాడ్(0)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. దయాల్ ఓవర్లో మిచెల్ ఆడిన బంతిని కోహ్లీ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అంతే.. చెన్నై డగౌట్లో ఆందోళన మొదలైంది.