Roger Federer | ఫ్రెంచ్ ఓపెన్‌లో అతడు ఆడకుంటే టెన్నిస్‌కు పెద్ద నష్టం : ఫెదరర్
Roger Federer : క్లే కోర్ట్ కింగ్‌గా పేరొందిన నాదల్(Rafael Nadal) అందరూ ఊహించినట్టుగానే ఫ్రెంచ్ ఓపెన్(French Open 2o23) నుంచి తప్పుకున్నాడు. మట్టి కోటలో ఘనమైన రికార్డు కలిగిన స్పెయిన్ బుల్ ఈ సారి టోర్నీకి దూరం కావడం పట్ల మాజీ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ విచారం వ్యక్తం చేశాడు. నాదల్ ఆడకపోవడం టెన్నిస్‌కు పెద్ద నష్టమని అతను అభిప్రాయపడ్డాడు.
Roger Federer : క్లే కోర్ట్ కింగ్‌గా పేరొందిన నాదల్(Rafael Nadal) అందరూ ఊహించినట్టుగానే ఫ్రెంచ్ ఓపెన్(French Open 2o23) నుంచి తప్పుకున్నాడు. మట్టి కోటలో ఘనమైన రికార్డు కలిగిన స్పెయిన్ బుల్ ఈ సారి టోర్నీకి దూరం కావడం పట్ల మాజీ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ విచారం వ్యక్తం చేశాడు. నాదల్ ఆడకపోవడం టెన్నిస్‌కు పెద్ద నష్టమని అతను అభిప్రాయపడ్డాడు.
‘ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నాదల్ వైదొలిగాడని విన్నాను. అది నిజంగా టెన్నిస్‌కు చాలా పెద్ద నష్టం’ అని ఫెదరర్ అన్నాడు. స్కై స్పోర్ట్స్ ఛానెల్లో మాట్లాడిన అతను నాదల్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మే 22వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు జరగనుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 – రెండో రౌండ్లోనే నాదల్ నిష్క్రమణ

పునరాగమనంపై సందిగ్దత
ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్కు తిరుగులేని రికార్డు ఉంది. అతను అత్యధికంగా 14 సార్లు రొలాండ్ గారోస్ ట్రోఫీ నెగ్గాడు. అలాంటిది ఈ స్పెయిన్ బుల్ ఈసారి ఆడడం లేదు. టెన్నిస్ కోర్టులో సంచలనాలు సృష్టించిన రఫా కొన్నాళ్లుగా మైదానంలోకి దిగడం లేదు. అందుకు కారణం.. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతుండగా అతడు గాయపడిన విషయం తెలిసిందే. ఈ మధ్యే నాదల్ తన పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మళ్లీ రాకెట్ ఎప్పుడు పడతానో చెప్పలేనని, గాయం ఇంకా తగ్గలేదని తెలిపాడు.
ఇద్దరూ.. పోటాపోటీగా
టెన్నిస్ ఆటలో దిగ్గజాలైన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ప్రత్యర్థులుగా హోరాహోరీగా తలపడిన వీళ్లు పోటాపోటీగా గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచారు. అంతేకాదు కొన్నేండ్లు టెన్నిస్ కోర్టులో ఏకఛత్రాధిపత్యం చెలాయించారు. అలాంటిది ఫెదరర్ వీడ్కోలు పలకడంతో టెన్నిస్ కళ తప్పింది. ఇప్పుడు నాదల్ కూడా మెగా టోర్నీల్లో ఆడకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఇవి కూడా చదవండి
Babar Azam: తొలి వంద వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా బాబర్ ఆజమ్
Virat Kohli | ఇదో అద్భుతం.. భూతద్దం సాయంతో కోహ్లీ రూపం.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

