Netizens troll Virat Kohli | విరాట్ కోహ్లిని దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. ఆ పోస్టే కారణం!
Netizens troll Virat Kohli | కోహ్లీ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ ఒలింపియన్లకు సంబంధించిన పోస్ట్ అది.

లండన్: ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ( Virat kohli ) ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న భారతీయుడు. అతడు అందులో ఏ పోస్ట్ చేసినా దానికి ఓ విలువ ఉంటుంది. ఆర్థికంగా ఈ పోస్టులు విరాట్‌కు కోట్లు కురిపించేవి కాగా.. తనను ఫాలో అయ్యే ఎంతో మంది అభిమానుల్లో ఇవి ఆసక్తి రేపుతాయి. అలాంటి ప్లేయర్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ ఒలింపియన్లకు సంబంధించిన పోస్ట్ అది.
వాట్ ఎ రికార్డ్. 10 శాతం మంది ఇండియన్ ఒలింపియన్లు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనట. ఈ ఎల్పీయూ ఇండియన్ క్రికెట్ టీమ్‌కు కూడా తన స్టూడెంట్స్‌ను పంపిస్తుందని భావిస్తున్నా అని కోహ్లి ఆ పోస్ట్‌లో కామెంట్ చేశాడు. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఇండియన్ అథ్లెట్లు మన్‌ప్రీత్ సింగ్, నీరజ్ చోప్రా, నిషాద్ కుమార్, అమోజ్ జాకబ్, మణ్‌దీప్ సింగ్, భజరంగ్ పూనియా, వరుణ్ కుమార్‌లు ఈ ఎల్పీయూ నుంచి వచ్చిన వాళ్లే.
వీళ్లను ఉద్దేశించే విరాట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. అయితే అది కాస్త రివర్స్ అయింది. ఇది చూసి అభిమానులు అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విరాట్ ఏంటి ఇలాంటి పోస్ట్ చేయడమేంటని కొందరు కామెంట్స్ చేశారు. అయితే కోహ్లి చేసిన ప్రమోషనల్ పోస్ట్లాగా ఇది కనిపిస్తున్నా.. అదేదో పెయిడ్ పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు కదా అని కూడా కొందరు అనడం విశేషం.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

