FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-బిలో ఉన్న ఇంగ్లండ్ తొలిమ్యాచ్‌లో ఇరాన్‌పై 6-2 పాయింట్లతో గెలిచింది. జుడ్ బెల్లింగ్హమ్ ఇంగ్లండ్ తరఫున మొదటి గోల్ చేశాడు. బుకాయో సకయా రెండు గోల్స్ సాధించాడు. రహీం స్టెర్లింగ్, మార్కస్ రష్‌ఫోర్డ్, జాక్ గ్రియలిష్ తలా ఒక గోల్ కొట్టారు. ఇరాన్ జట్టు నుంచి మెహది తరేమి ఒక్కడే రెండు గోల్స్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో నాలుగు పాయింట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ ఫిఫా వరల్డ్ కప్‌లో రెండో పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. 2018 వరల్డ్ కప్‌లో పనామా మీద ఇంగ్లండ్ 6-1 గోల్స్‌తో గెలిచింది.