Golden Boy Award : ఇంగ్లండ్, రియల్ మాడ్రిడ్ మిడ్ ఫీల్డర్ జుడె బెల్లింగమ్( Jude Bellingham) ప్రతిష్ఠాత్మక గోల్డ్‌న్ బాయ్ అవార్డు(Golden Boy Award)కు ఎంపికయ్యాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనకు గానూ జుడె ఈ అవార్డు అందుకోనున్నాడు. యూరప్ వ్యాప్తంగా అండర్ -21 కేటగిరీలో ప్రకటించే ఈ అవార్డుకు ఈసారి నలుగురు పోటీ పడ్డారు.
జమల్ ముసియల, రస్మస్ హోజ్లుండ్, లెవీ కోల్విల్లను వెనక్కి నెట్టి 20 ఏండ్ల జుడే విజేతగా నిలిచాడు. దాంతో, ఈ అవార్డు అందుకున్న మూడో ఇంగ్లండ్ ఫుట్‌బాలర్‌గా జుడె రికార్డు నెలకొల్పాడు.
JUDE BELLINGHAM is Golden Boy Absolute Best! @realmadrid #Goldenboy #Goldenboy2023 #football pic.twitter.com/VXIMAjlDED
— Golden Boy (@GoldenBoyAwards) November 17, 2023
ఇంగ్లండ్ దిగ్గజం వేన్ రూనీ(2004), రహీం స్టెర్లింగ్(2014)లో ఈ అవార్డు గెలిచారు. అంతేకాదు అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ, ఫ్రాన్స్ యువకెరటం కైలియన్ ఎంబాపే కూడా గోల్డెన్ బాయ్ అవార్డు అందుకున్నారు. ఈ సీజన్లో జుడె 15 గోల్స్ కొట్టడమే కాకుండా 17 గోల్స్‌కు సహకరించాడు. ఇంగ్లండ్ తరఫున 12 మ్యాచ్‌లు ఆడిన ఈ యంగ్‌స్టర్ రెండు గోల్స్ స్కోర్ చేశాడు.