Spirit Of Fighter | బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter). సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ రోల్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతున్నట్టు తెలియజేస్తూ.. విడుదల చేసిన లుక్‌లో సూపర్ హ్యాండ్ సమ్‌గా కనిపిస్తున్నాడు హృతిక్ రోషన్.
తాజాగా దీపికాపదుకొనే పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. దీపిక ఇందులో ఎయిర్ డ్రాగన్ యూనిట్లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనుంది. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్-మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫైటర్ టీజర్‌ను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
వినీలాకాశంలో ఫైటర్ జెట్స్ ఎగురుతూ.. దేశభక్తి ఉప్పొంగిపోయేలా కనిపిస్తున్న ఫైటర్ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో తొలిసారి కలిసి కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. పఠాన్ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ కాంపౌండ్ నుంచి వస్తుండటంతో ఫైటర్‌పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో మూవీ లవర్స్, అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు హృతిక్ రోషన్. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశాల్లో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు హృతిక్ రోషన్.
మిన్ని ఫస్ట్ లుక్..
Here is #DeepikaPadukone in a groundbreaking portrayal as Squadron Leader Minal Rathore in #Fighter, known by her call sign ‘Minni’. 🌟
Her role as a Squadron Pilot in the Air Dragons unit showcases resilience and valor.
This marks her first ‘mission’ as a helicopter pilot as… pic.twitter.com/26nseSSCXB
— Ashwani kumar (@BorntobeAshwani) December 5, 2023
Squadron Leader Shamsher Pathania
Call Sign: Patty
Designation: Squadron Pilot
Unit: Air DragonsFighter Forever 🇮🇳#Fighter #FighterOn25thJan #FighterMovie pic.twitter.com/os5XkTD3hS
— Hrithik Roshan (@iHrithik) December 4, 2023
Want this craze again🔥 #Fighter pic.twitter.com/81o67xWq9C
— Ansh (@ansh_0123) November 27, 2023
Bas kuch pal intejar h,uske baad gadar hoga 🔥🔥🔥#Fighter #HrithikRoshanpic.twitter.com/nSEu29aPDz
— ᴿᴬᴹᴮᴼ 🅵🅸🅶🅷🆃🅴🆁 (@rambo_SATYA_) December 3, 2023
#Fighter#ElectionResults
Lets go #Dunki #srk #jawan #Prabhas 📷 📷 #PrashanthNeel #Tiger3 #skf #SalmanKhan #KatrinaKaif #AnimalMovie #ANIMAL #Salaar 📷 📷 #SalaarCeaseFire 📷 #snow #U17WC #AnimalTheMovie #MelodySalaar $portal @Portalcoin pic.twitter.com/IoNRWsQBMT— shiv |✨OVERWORLD (@Shivkum61957461) December 3, 2023
Spirit Of Fighter అప్డేట్..