క్రికెట్లో కొత్త టోర్నీ హండ్రెడ్.. రూల్స్ రిలీజ్ చేసిన ఈసీబీ

లండన్: వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న క్రికెట్ ఎప్పటికప్పుడు కొత్తగా అభిమానుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చినవే వన్డేలు, టీ20లు, టీ10 లీగ్‌లు. ఇప్పుడు తాజాగా హండ్రెడ్ పేరుతో మరో కొత్త టోర్నీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన నిబంధనలను తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రిలీజ్ చేసింది. ఇన్నింగ్స్‌కు 100 బాల్స్ ఉండే ఈ కొత్త ఫార్మాట్ ఆసక్తి రేపుతోంది.
ఎలా ఆడతారు?
- ఇన్నాళ్లూ క్రికెట్లో ఓవర్లు ఉండేవి. కానీ ఈ కొత్త ఫార్మాట్లో ఓవర్లు ఉండవు. బాల్స్ ఆధారంగానే ఇన్నింగ్స్ మారుతుంది. ఒక బౌలర్ ఒకే ఎండ్ నుంచి రెండుసార్లు ఐదేసి బంతులు వేయాల్సి ఉంటుంది. తొలి ఐదు బంతులు ముగిసిన తర్వాత అంపైర్ ఓ వైట్ కార్డు చూపిస్తాడు. ఓ సెట్ పూర్తయినట్లుగా ప్రేక్షకులు, స్కోరర్లు, కామెంటేటర్లు, బ్రాడ్కాస్టర్లకు తెలియడానికి ఇలా చేస్తారు.
- ఇక టాస్ గ్రౌండ్‌లోనే వేయాలన్న రూలేమీ లేదు.
- తొలి 25 బంతులు పవర్ ప్లే. ఈ సమయంలో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉంటుంది.
- పవర్ ప్లే ముగిసిన తర్వాత ఎప్పుడైనా ఫీల్డింగ్ టీమ్ రెండు నిమిషాల స్ట్రేటజిక్ టైమౌట్ తీసుకోవచ్చు.
- ఒక బ్యాట్స్‌మన్ క్యాచ్ అవుటైన తర్వాత అవతలి బ్యాట్స్‌మన్ క్రాస్ అయ్యాడా లేదా అన్నదానితో సంబంధం లేకుండా కొత్త బ్యాట్స్‌మన్ స్ట్రైక్ తీసుకోవాలి.
- గ్రూప్ స్టేజ్‌లో టై అయితే రెండు టీమ్స్‌కు ఒక్కో పాయింట్ ఇస్తారు. అదే ఎలిమినేటర్, ఫైనల్లో టై అయితే.. సూపర్ ఫైవ్ ఆడాల్సి ఉంటుంది. అంటే ఒక్కో టీమ్ ఐదు బాల్స్ ఆడాల్సి ఉంటుంది.
- ఒకవేళ సూపర్ ఫైవ్ టై అయితే.. మరో సూపర్ ఫైవ్ ఆడిస్తారు. అది కూడా టై అయితే.. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌లో ఉన్న వాళ్లను విజేతలుగా ప్రకటిస్తారు.
- వర్షం వల్ల ప్రభావితమైన మ్యాచ్‌లలో కొత్త డీఎల్ఎస్ పద్ధతి ఉపయోగిస్తారు.
- ఒకవేళ టీమ్ నెమ్మదిగా బౌలింగ్ చేస్తుందనుకుంటే అంపైర్ పెనాల్టీ విధించవచ్చు. దీని ప్రకారం ఫీల్డింగ్ టీమ్‌కు సర్కిల్ బయట ఒక ఫీల్డర్‌ను తగ్గించాల్సి ఉంటుంది.
- ఈ టోర్నీలో మొత్తం 8 మెన్స్, వుమెన్స్ టీమ్స్ పాల్గొంటున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

