FIFA World Cup | వరల్డ్‌కప్‌లో ‘వయాగ్రా’.. ఇంగ్లండ్ వ్యూహం ఫలించేనా..!
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్(England) జట్టు సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జూలై 4 శనివారం మెక్సికోతో నాకౌట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్.. తమ ఆటగాళ్లను 'వయాగ్రా'(Viagra) మాత్రలు తీసుకునేందుకు అనుమతించింది.
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్(England) జట్టు సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జూలై 4 శనివారం మెక్సికోతో నాకౌట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్.. తమ ఆటగాళ్లను ‘వయాగ్రా'(Viagra) మాత్రలు తీసుకునేందుకు అనుమతించింది. శక్తికోసం తమ ప్లేయర్లను వయాగ్రా ఉపయోగించాలని కెప్టెన్ హ్యారీ కేన్, మేనేజర్ థామస్ టుచెల్ చెప్పారు. సాధారణంగా లైంగిక శక్తిని రెట్టింపు చేసే ఈ వయాగ్రాను ఇంగ్లండ్ ఆటగాళ్లకు సూచించడానికి బలమైన కారణమే ఉందండోయ్.
సాకర్ ప్రపంచకప్‌లో 16వ రౌండ్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ భిన్నంగా సిద్ధమవుతోంది. మెక్సికోతో తలపడనున్న ఇంగ్లండ్ ఇప్పటికే తమ ఆటగాళ్లకు రాత్రిపూట కంటినిండా నిద్రకు భద్రతా సిబ్బంది సాయం కోరింది. ఇది చాలదన్నట్టు.. మ్యాచ్ సమయంలో తమ ఆటగాళ్లు తొందరగా అలసటకు గురవ్వకుండా వయాగ్రా మాత్రలు ఉపయోగించేందుకు ఇంగ్లండ్ మేనేజర్ థామస్ టుచెల్, కెప్టెన్ హ్యారీ కేన్ అనుమతించారు.
🚨JUST IN: England players will be allowed to use Viagra to help deal with Mexico’s altitude, with Estadio Azteca being 7,350 feet above sea level
Viagra can reduce fatigue related to physical exertion at high altitude pic.twitter.com/Hihg3xGcqY
— Polymarket Sports (@PolymarketSport) July 3, 2026
ఎందుకంటే.. మెక్సికో జాతీయ మైదానం ఎస్తాడియో అజ్టెకా(Estadio Azteca) చాలా ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉండే ఈ స్టేడియంలో సరిపోను ఆక్సిజన్ అందదు. బలంగా వీచే గాలి.. ఆక్సిజన్ కొరత వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆటగాళ్లకు సవాల్ విసురుతాయి.
ఆతిథ్య మెక్సికో జట్టు ప్లేయర్లకు ఎస్తాడియో అజ్టెకా పరిస్థితులకు అలవాటే కాబట్టి వారికి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కానీ, ఇంగ్లండ్ ప్లేయర్లకు ఇక్కడ ఆడడం శక్తికిమించిన పనే. అంత ఎత్తులో త్వరగా అలిసిపోయే అవకాశముంది. అందుకని తమ టీమ్‌కు అలసటను దరి చేరనివ్వకుండా వయాగ్ర మంత్రాన్ని ఉపయోగించడమే శరణ్యమని ఇంగ్లండ్ భావించింది. ఇంకేముంది.. తమ ఆటగాళ్లు వయాగ్రా మాత్రలను తీసుకొని.. మ్యాచ్ ఆడేందుకు హ్యారీ, టుచెల్ సమ్మతం తెలిపారు. వరసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న మెక్సికోను నిలువరించాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదని ఇంగ్లండ్ మేనేజర్ వెల్లడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

