AUS vs ENG | ఆసిస్‌తో ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్.. మ్యాచ్ గెలవాలంటే ఆస్ట్రేలియాకు ఎన్ని పరుగులు కావాలంటే..
AUS vs ENG | ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ఐదో టెస్టులోనూ బజ్‌బాల్ ఆటతీరు కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. 5.17 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టిన ఇంగ్లిష్ జట్టు.. 54.4 ఓవర్లలోనే కుప్పకూలింది.
AUS vs ENG | ఓవల్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ఐదో టెస్టులోనూ బజ్‌బాల్ ఆటతీరు కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. 5.17 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టిన ఇంగ్లిష్ జట్టు.. 54.4 ఓవర్లలోనే కుప్పకూలింది. హ్యరీ బ్రూక్ (85; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బెన్ డకెట్ (41), మోయిన్ అలీ (34), వోక్స్ (36) తలా కొన్ని పరుగులు చేశారు.
కెప్టెన్ బెన్ స్టోక్స్ (3), మాజీ కెప్టెన్ జో రూట్ (5), బెయిర్ స్టో (4) విఫలమయ్యారు. కంగారూ బౌలర్లలో స్టార్క్ 4, హజిల్‌వుడ్, మార్ఫీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆస్ట్రేలియా ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 222 పరుగులు వెనుకబడి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

