ENG vs AUS: తడబడ్డా నిలబడ్డ ఆసీస్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..!
ENG vs AUS: . గత నాలుగు మ్యాచులలో బ్యాటింగ్ లో వీరబాదుడు బాదుతున్న ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ తో ఆదిలో తడబడినా మిడిలార్డర్‌తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు రాణించడంతో ప్రత్యర్థి ముందు పోరాడే స్కోరును నిలిపింది.
ENG vs AUS: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు ఓడిన ఇంగ్లండ్.. పరువు నిలుపుకోవడానికి ఆడుతున్న మ్యాచ్‌లో ఆసీస్‌ను కట్టడిచేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. గత నాలుగు మ్యాచులలో బ్యాటింగ్‌లో వీరబాదుడు బాదుతున్న ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌తో ఆదిలో తడబడినా మిడిలార్డర్‌తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు రాణించడంతో ప్రత్యర్థి ముందు పోరాడే స్కోరును నిలిపింది. అహ్మదాబాద్ వేదికగా ఈ ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబూషేన్ (83 బంతుల్లో 71, 7 ఫోర్లు) , కామెరూన్ గ్రీన్ (52 బంతుల్లో 47, 5 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (52 బంతుల్లో 44) రాణించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు ఆదిలోనే డబుల్ స్ట్రోక్ తాకింది. ట్రావిస్ హెడ్ (11)తో పాటు ఈ టోర్నీలో భీకర ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ (15)లు విఫలమయ్యారు. ఈ రెండు వికెట్లూ క్రిస్ వోక్స్కే దక్కాయి. 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు మూడో వికెట్‌కు 75 రన్స్ జోడించారు.
బ్రేక్ ఇచ్చిన రషీద్..
అర్థ సెంచరీ దిశగా సాగుతున్న స్మిత్‌ను అదిల్ రషీద్ ఔట్ చేశాడు. కొద్దిసేపటికే వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (3) ను కూడా రషీద్ పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన గ్రీన్ తో కలిసి ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించిన లబూషేన్‌ను మార్క్‌వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గ్రీన్ – స్టోయినిస్ (35)లు ఆరో వికెట్‌కు 45 రన్స్ జతచేసి ఆసీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపిస్తుండగా.. డేవిడ్ విల్లే కంగారూలను దెబ్బతీశాడు. 40వ ఓవర్లో గ్రీన్‌ను ఔట్ చేయడంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపు మెరుపులు మెరిపించిన స్టోయినిస్‌ను వుడ్ ఔట్ చేశాడు. కానీ ఆఖర్లో ఆడమ్ జంపా (19 బంతుల్లో 29, 4 ఫోర్లు) ధాటిగా ఆడి ఆసీస్ స్కోరును 280 మార్కు దాటించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు తీయగా అదిల్ రషీద్, మార్క్ వుడ్లు తలా రెండు వికెట్లు తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

