FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో లీగ్ దశ దాటడమే గగనం. అలాంటిది నాలుగుసార్లు ఛాంపియన్‌ను ఓడించి నాకౌట్‌కు దూసుకెళ్తే ఆ కిక్కే వేరబ్బా. ఇప్పుడు ఈక్వెడార్(Ecuador) జట్టు.. ఆ దేశ ప్రజలు అదే కిక్కులో మునిగితేలుతున్నారు. జర్మనీకి షాకిచ్చిన ఈక్వెడార్ నాకౌట్ బెర్తు పట్టేయడం ఆ దేశాన్ని సంబురాల్లో ముంచెత్తింది. తమ జట్టు అద్భుతం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అధ్యక్షుడు డానియెల్ నొబోవా అజిన్ శుక్రవారం దేశమంతా సెలవు దినం ప్రకటించారు. ఆటగాళ్లు, కోచ్‌ను అభినందించిన ఆయన.. తమ జట్టు విజయాన్ని అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి వీలుగా హాలి డే డిక్లేర్ చేశారు.
సాకర్ వరల్డ్‌కప్‌లో నాకౌట్లో అడుగుపెట్టడం చిన్న విషయమేమీ కాదు. మేటి జట్లను ఓడిస్తేగానీ లీగ్ దశ దాటటడం సాధ్యమవ్వదు. ఫిఫా వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసే ఈక్వెడార్ ఈసారి అతిపెద్ద సంచలనం నమోదు చేసింది. గతంలో నాలుగుసార్లు ఛాంపియన్ జర్మనీపై 2-1తో జయభేరి మోగించి నాకౌట్ బెర్తు సాధించింది. దాంతో, ఈక్వెడార్ అధ్యక్షుడు డానియెల్ నొబోవా అజిన్ ఆనందం పట్టలేకపోయారు. తమ జట్టు విజయాన్ని కీర్తించిన ఆయన.. దేశమంతా సెలవు ప్రకటించారు.
Gracias a los jugadores y al técnico que, a pesar de las críticas, los insultos y los malos ratos que pasaron, lograron recuperarse y darle esta inmensa alegría al país entero.
¡Mañana, feriado!
Viva el Ecuador.
— Daniel Noboa Azin (@DanielNoboaOk) June 25, 2026
‘ఈక్వెడార్ ఆటగాళ్లు, కోచ్‌కు ధన్యవాదాలు. విమర్శలు, అవమానాలు, కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు గొప్పగా రాణించి దేశాన్ని సంబురాల్లో ముంచెత్తారు. రేపు శుక్రవారం దేశమంతా సెలవు ప్రకటిస్తున్నా. ఈక్వెడార్ జిందాబాద్’ అని ఎక్స్ పోస్ట్‌లో డానియల్ పేర్కొన్నారు.
కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను గ్రూప్ ఈలోని ఈక్వెడార్ ఓటమితో ఆరంభించింది. తొలి పోరులో ఐవరీకోస్ట్ చేతిలో 0-1తో ఓడిన ఆ జట్టు.. కురకావోతో రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. చావోరేవో పోరులో గురువారం జర్మనీపై ఈక్వెడార్ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారు. తొలుత జర్మనీ ఆటగాడు సేన్ రెండో నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యాన్ని అందించాడు.
Football is a game changer and a leveller. Imagine Ecuador eliminating Germany in the group stage, the almighty Germany. pic.twitter.com/tDzF2sAVTc
— FIFA World Cup 2026 (@FIFAWorldCup26M) June 26, 2026
కాసేపటికే ఈక్వెడార్ ప్లేయర్ నీల్సన్ ఆంగులో 9వ నిమిషంలో గోల్ చేయగా స్కోర్ సమం అయింది. రెండో అర్ధ భాగంలో పెనాల్టీ లభించినా జర్మనీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 77వ నిమిషంలో ఈక్వెడార్ ఆటగాడు గొంజాలెజ్ ప్లాటా గోల్‌తో 2-1తో అదిరే విజయాన్ని అందించాడు.