BCCI | రంజీ విజేతలకు ప్రైజ్ మనీ పెంపు.. కీలక టోర్నీలకు మోక్షం.. దేశవాళీపై దృష్టిపెట్టిన బీసీసీఐ
కరోనా కారణంగా రెండేండ్ల పాటు కుంటుపడిన దేశవాళీ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నడుం కట్టింది. ఈ మేరకు గురువారం ముంబైలో ముగిసిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. గడిచిన మూడేండ్లుగా కరోనా వల్ల ఆగిపోయిన దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌లను ఈ ఏడాది నుంచి మళ్లీ నిర్వహించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. దీంతోపాటు ఘనచరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ విన్నర్లకు అందజేసే నగదు బహుమతని పెంచాలని నిర్ణయించింది.
ప్రస్తుతం రంజీ విజేతలకు క్యాష్ ప్రైజ్‌గా రూ. 2 కోట్లు అందుతున్నది. దీనిని పెంచాలని అపెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే పెంపు ఎంతమేరకు ఉంటుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. బీసీసీఐకి ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా (రూ. 48,390 కోట్లు) ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశవాళీ క్రికెట్‌ను సంస్థాగతంగా చక్కదిద్దేందుకు ప్రయత్నాలను మమ్మురం చేసింది.
అంతేగాక కరోనా మహమ్మారి వల్ల గత రెండేండ్లుగా వాయిదా పడ్డ దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్, సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను ఇకనుంచి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి దేశవాళీ సీజన్‌ను బిజీగా మార్చేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
రంజీలలో డీఆర్ఎస్..
దేశవాళీ క్రికెట్‌ను పటిష్టం చేయడంతో పాటు రంజీలలో డిసీషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. గడిచిన కొన్నాళ్లుగా రంజీలలో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టాలని బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో బోర్డు ఈ దిశగా ముందడుగు వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

