BCCI : భారత దిగ్గజాల వారసులు అంతర్జాతీయ క్రికెట్‌వైపు వేగంగా దూసుకొస్తున్నారు. జూనియర్ స్థాయిలో అదగొడుతున్న రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు అండర్ -19 జట్టులోకి వచ్చేశారు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న అన్వయ్ ద్రవిడ్(Anvay Dravid), ఆర్యవీర్ సెహ్వాగ్(Aaryavir Sehwag)లు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ప్రకటించిన బృందంలో చోటు దక్కించుకున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల కుమారులు అండర్-19 స్క్వాడ్‌కు ఎంపికయ్యారు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం సెలెక్టర్లు ద్రవిడ్ పెద్దబ్బాయి అన్వయ్ ద్రవిడ్, వీరూ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌లను తీసుకున్నారు.
Two familiar surnames in that squad 👀
Aaryavir Sehwag (son of Virender Sehwag) and Anvay Dravid (son of Rahul Dravid) have been named in India’s U19 squad for three One-Day matches against Australia
Image Credit: DPL pic.twitter.com/XyEdIQhchO
— Cricbuzz (@cricbuzz) August 27, 2026
వికెట్ కీపర్‌గా అన్వయ్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో దంచేస్తున్న ఆర్యవీర్ అండర్-19 స్క్వాడ్‌లోకి మొదటిసారి ఎంపికయ్యాడు. యువ భారత్‌కు లక్ష్య రాయ్‌చందని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆసీస్‌తో సెప్టెంబర్18న వన్డే సిరీస్ మొదలవ్వనుంది. అలానే.. రెండు మల్టీ డే మ్యాచ్‌లకు ప్రత్యేక స్క్వాడ్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఈ మ్యాచుల్లో టీమిండియాకు యశ్బర్ధన్ సింగ్ చౌహన్ నాయకత్వం వహించనున్నాడు.
🔴JUNIOR SEHWAG & JUNIOR DRAVID READY FOR INDIA DEBUT 🤯
– Aaryveer Sehwag smashed 297-run knock for Delhi U-19 team against Meghalaya at age of 17 in November 2024.
– Anvay Dravid Smashed 87(67) against Sri Lanka A in July 2026.
After seeing such good records, both have… pic.twitter.com/VYxmKuY5IB
— Sam (@cricsam02) August 27, 2026
భారత వన్డే స్క్వాడ్(వన్డే సిరీస్ కోసం) : లక్ష్య రాయ్‌చందని(కెప్టెన్), యశ్‌బర్దన్ సింగ్ చౌహన్(వైస్ కెప్టెన్), రజత్ బఘేల్(వికెట్ కీపర్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీ.కే. వినీత్ కుషగ్ర ఓఘా, అర్జున్ రాజ్‌పుత్, మానల్ చౌహన్, అన్వయ్ ద్రవిడ్(వికెట్ కీపర్), వి.యశ్వీర్ యాదవ్, శవిన్ వినోద్, మోహిత్ ఉల్వ, చిగురుపాటి వెంటకట, కావ్య పటేల్.