హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ స్విమ్మర్ శివానీ కర్రా జాతీయస్థాయిలో మరోమారు అదరగొట్టింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న 33వ సజ్జూనియర్, జూనియర్ సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో శివానీ రెండు స్వర్ణాలతో మెరిసింది. మంగళవారం జరిగిన 100మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో శివానీ 1ని.14.04 సెకన్ల టైమింగ్‌తో పసిడి దక్కించుకోగా, శ్రేయా బిన్నిల్, అన్నికా దెబోరా వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. అదే జోరు కొనసాగిస్తూ 100మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో ఈ 10 ఏండ్ల యువ స్విమ్మర్ 1ని.16.57సెకన్లలో రేసు ను ముగించి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో కోచ్ ఆయూశ్ యాదవ్ దగ్గర శివానీ శిక్షణ తీసుకుంటున్నది.