Novak Djokovic | ఏడాది తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలి మ్యాచ్ గెలిచిన జకోవిచ్
ఫ్రాన్స్‌కు చెందిన లెస్టియెన్నెపై 6-3, 6-2తో జకోవిచ్ విజయం సాధించాడు
Novak Djokovic : టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కొత్త ఏడాదిలో శుభారంభం చేశాడు. అంతేకాదు ఏడాది వివాదం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయం నమోదు చేశాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆడిలైడ్ ఇంటర్నేషనల్ 32వ రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన లెస్టియెన్నెపై 6-3, 6-2తో జకోవిచ్ విజయం సాధించాడు. ‘మళ్లీ ఆస్ట్రేలియాలో ఆడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అందరికి కృతజ్ఞతలు’ అని మ్యాచ్ అనంతరం జకోవిచ్ అన్నాడు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదనే కారణంతో అతడిని 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు నిర్వాహకులు అనుమతించలేదు. అంతేకాదు అతనిపై మూడేళ్ల పాటు నిషేధం విధించింది. అయితే.. పోయిన ఏడాది నవంబర్‌లో ఆ నిషేధాన్ని ఎత్తేసింది. దాంతో, జకోవిచ్ మళ్లీ ఆస్ట్రేలియా గడ్డ మీద కాలు మోపాడు.
‘నేను ఎక్కువ విజయాలు సాధించిన దేశం, టెన్నిస్ ఆటగాడిగా నన్ను ఎంతో ఇష్టపడిని దేశం ఆస్ట్రేలియా. నేను 2008లో ఇక్కడే తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచాను. ఇప్పటివరకూ 9 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు సాధించాను. ఈ గడ్డ మీద నేను ఎన్నో గొప్ప మ్యాచ్‌లు ఆడాను. ఇక్కడ ఆడుతుంటే నా ఉత్తమ ఆట బయటకు వస్తుంది’ అని జకోవిచ్ అన్నాడు. ఇతను ఇప్పటివరకూ 21 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. ఫెదరర్, నాదల్ వంటి స్టార్ ఆటగాళ్లను ఎదుర్కొంటూ టెన్నిస్‌లో కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. అంతేకాదు నంబర్ 1 ర్యాంక్ కూడా సొంతం చేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

