మెల్బోర్న్: సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన ఆష్లే బార్టీ తన నంబర్‌వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. ఈ టోర్నీలో పాల్గొనకపోయినా సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ పురుషుల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంక్‌లను ఆదివారం ప్రకటించారు. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సబలెంక, క్రెజికోవా వరుసగా రెండు, మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు. పోలాండ్ భామ స్వియాటెక్ ఐదు ర్యాంక్‌లు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరగా.. మాజీ నంబర్‌వన్ స్పెయిన్ స్టార్ ముగురుజా నాలుగు ర్యాంక్‌లు కోల్పోయి ఏడో స్థానానికి చేరింది. పురుషుల విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. వరుసగా జ్వెరెవ్, సిట్సిపాస్ మూడు, నాలుగింటిలో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నాదల్ 5వ ర్యాంక్‌కు చేరగా.. రుబ్లెవ్ 6, బెరెటిని 7వ ర్యాంక్‌ల్లో ఉన్నారు.