భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు పెద్ద షాక్ తగిలింది. 2016 రియో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచిన ఆమె.. 2021 టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైంది. కరోనా కారణంగా ఒలింపిక్ క్వాలిఫైయర్లు రద్దవడంతో ఆమె టోక్యో వెళ్లలేకపోయింది.
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ క్యాంప్‌లో ఆమె పాల్గొనడం లేదు. స్వస్థలం అగర్తలకు వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య అయిన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి జిమ్నాస్టిక్.. దీపా ప్రొఫైల్‌ను ‘సస్పెండెడ్’ అని పేర్కొంటోంది.
ఇది చూసిన తాము చాలా షాకయ్యామని దీప కోచ్ బిశ్వేశ్వర నంది అన్నారు. ప్రస్తుతం ఇండియా నేషనల్ క్యాంప్‌లో శిక్షణ ఇస్తున్న నంది.. దీప సస్పెండ్ అవడంపై జిమ్నాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి సమాచారమూ అందలేదన్నారు. అంతర్జాతీయ ఫెడరేషన్ ఆమెను ‘సస్పెండెడ్’గా ఎందుకు పేర్కొంటుందో కూడా తమకు తెలియదన్నారు. దీనిపై తమకు సమాచారం అందగానే అందరికీ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.