Chennai Super Kings : ఐపీఎల్ ప్రతి సీజన్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పేలవమైన ఆటతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో నిరాశపరుస్తున్న చెన్నై ఆట చూసిన వాళ్లంతా ‘అసలు ఆడుతున్నది ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టేనా? అని నిర్ఘాంతపోతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) లేకుంటే సీఎస్కే ఉత్త జట్టేనా అని చాలామంది వాపోతున్నారు. వరల్డ్ క్లాస్ ఆటగాళ్లున్నా పసుపు దళం తడబడుతుంటే చూడలేక పోతున్నారు చెన్నై ఎక్కడ లయ తప్పింది? అనేది ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. అంతేకాదు రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పంతొమ్మిదో సీజన్లో ఎంఎస్ ధోనీ గైర్హాజరీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆట అధ్వాన్నంగా మారింది. స్టార్లు ఆటగాళ్లు లేకున్నా కుర్రాళ్లతో నిండిన చెన్నైని 2023లో విజేతగా నిలిపిన ధోనీ వారసత్వాన్ని కొనసాగించడంలో రుతురాజ్ గైక్వాడ్ దారుణంగా విఫలమవుతున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న పెద్దన్నలాంటి ధోనీ ఈ సీజన్లో ఆడడంపై స్పష్టత లేదు.
Skipper’s Knock! 🦁💪#WhistlePodu #CSKvGT pic.twitter.com/ht65b10tOO
— Chennai Super Kings (@ChennaiIPL) April 26, 2026
ఇటు చూస్తే.. నాయకుడిగా జట్టును ముందుండి నడపాల్సిన గైక్వాడ్ బ్యాటింగ్‌లో తేలిపోతూ జట్టుకు భారంగా మారాడు. 8 మ్యాచుల్లో వరసగా 6, 28, 7, 15, 7 పరుగులకే ఔటైన గైక్వాడ్ ఒకేఒక అర్ధ శతకంతో కలిపి 178 రన్స్ కొట్టాడు. దాంతో, రెండు శతకాలతో మెరిసిన శాంసన్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Double it and give it to the next lion! 🫴🏏
Chettan joins the club!#WhistlePodu pic.twitter.com/QxKid5Fzoh— Chennai Super Kings (@ChennaiIPL) April 24, 2026
ఈమధ్యే సొంతగడ్డపై ప్రపంచ కప్ గెలుపొందిన జట్టులోని సంజూ శాంసన్, శివం దూబే, భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన ఆయుశ్ మాత్రే వంటి స్టార్లు ఉన్నప్పటికీ చెన్నై నిరాశపరుస్తోంది. స్క్వాడ్ పరంగా కాగితం మీద బలంగానే ఉంది. కానీ, మైదానంలో మాత్రం శాంసన్ మినహా అందరూ చేతులెత్తేస్తున్నారు. గత సీజన్లో రెచ్చిపోయిన శివం దూబే ఈసారి ఘోరంగా ఆడుతున్నాడు. టీ20 సంచలనం డెవాల్డ్ బ్రెవిస్(5 మ్యాచుల్లో 64 రన్స్) సైతం స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు. సర్ఫారాజ్ ఖాన్ దంచేస్తున్నా అతడికి అండగా నిలిచేవారు లేరు.
CSK Suffer Big Blow, Lose Their Top-Scoring Batter For Remaining Season https://t.co/qA6C8g1So4 pic.twitter.com/c7JIsNiuq3
— CricketNDTV (@CricketNDTV) April 21, 2026
సీజన్ ఆరంభానికి ముందే పేసర్ నాథన్ ఎల్లిస్.. టోర్నీ మధ్యలో సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్, ఆయుశ్ మాత్రే గాయంతో వైదొలగడం చెన్నైకి పెద్ద దెబ్బ. ఇదిలా ఉంటే.. మినీ వేలంలో కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ వంటి కుర్రాళ్లను భారీ ధరకు కొన్న చెన్నై ఫ్రాంచైజీ వారిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. బౌలింగ్ యూనిట్లో అన్షుల్ కాంభోజ్, అకీల్ హొసేన్, నూర్ అహ్మద్‌లు మాత్రమే రాణిస్తున్నారు. ప్రపంచకప్‌లో బంతితోనూ మెరిసిన దూబేతో గైక్వాడ్ బౌలింగ్ చేయించకపోవడం కూడా చెన్నై విజయాలపై ప్రభావం చూపుతోంది.
మార్చి 30న తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిని చెన్నై సూపర్ కింగ్స్‌ను .. ఆపై పంజాబ్ కింగ్స్ దెబ్బ కొట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో చతికిలపడిన చెన్నై 43 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సంజూ శాంసన్ శతకంతో విరుచుకుపడగా.. హ్యాట్రిక్ ఓటముల నుంచి బయటపడిన చెన్నై.. అదే ఊపులో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది.
⏪ When we stood tall against the Titans! 💪#WhistlePodu #Yellove pic.twitter.com/YIxf2sszbl
— Chennai Super Kings (@ChennaiIPL) April 25, 2026
కానీ, సొంత మైదానంలో బ్యాటర్ల సమిష్టి వైఫల్యంతో గుజరాత్ టైటాన్స్ చేతిలో కంగుతిన్నది. గైక్వాడ్ అర్ధ శతకంతో 158 రన్స్ కొట్టిన సీఎస్కేపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఎనిమిదింటా మూడు విజయాలకే పరిమితమైన చెన్నై లీగ్ దశలో మరో 6 మ్యాచులు ఆడనుంది. వీటిలో కనీసం ఐదు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆడే అవకాశముంది.
Wickets ✅
Purple Cap ✅
Anshul blazing through 🔥#WhistlePodu #Yellove pic.twitter.com/FWm6nR8zsT— Chennai Super Kings (@ChennaiIPL) April 25, 2026