Indian Archers : అంతర్జాతీయ వేదికపై భారత ఆర్చర్లు(Indian Archers) అదరగొట్టారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్కప్ ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహొద్ పసిడి గురితో దేశం గర్వించేలా చేశారు. ఆదివారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ ఫైనల్లో దక్షిణ కొరియా జంటకు షాకిచ్చిన ధీరజ్, 17 ఏళ్ల కుంకుమ్ స్వర్ణ పతకంతో మెరిశారు. దాంతో, ఒలింపిక్ ఛాంపియన్ అయిన కొరియా ఆర్చర్లు వెండితో సరిపెట్టుకున్నారు.
ఆంటల్యాలో జరిగిన వరల్డ్ కప్ ఆర్చరీలో భారత పతకం ఆశలు మోసిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహెద్ ఫైనల్లో చెలరేగిపోయారు. ఒలింపిక్ విజేతలైన కొరియా జంట కిమ్ జె డియోక్ – ఒహ్ ఎ జిన్ను మట్టికరిపించారు. రికర్వ్ మిక్స్డ్ ఆర్చరీలో 5-1(37-36, 37-36, 39-39)తో ప్రత్యర్థిని నిలువరించి దేశానికి గోల్డ్ మెడల్ సాధించారు.
INDIA ARE RECURVE MIXED TEAM CHAMPIONS 🏆
Indian Mixed Team stunned Olympic Champion Korea 5-1 to win Antalya World Cup Stage 3
Dheeraj & Kumkum wins World Cup for India 🇮🇳
THIS IS PRETTY HUGE FOLKS 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/tZYDNgoksp
— The Khel India (@TheKhelIndia) June 14, 2026
రెండు నెలల వ్యవధిలో కొరియా జంటపై భారత ఆర్చర్లకు ఇది రెండో విజయం. ఆసియా క్రీడల్లో దీపికా కుమారి, కుంకుమ్ మొహెద్, అంకిత భకత్లతో కూడిన భారత త్రయం హోరాహోరీ పోరులో కొరియా ఆర్చర్లను చిత్తు చేసింది.