Junior Jonty Rhodes | ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్.. జాంటీ రోడ్స్‌ను తలపించిన సఫారీ కుర్రాడు
Junior Jonty Rhodes : క్రికెట్ మైదానంలో పక్షిని తలపించేలా విన్యాసాలు చేస్తుంటారు కొందరు ఫీల్డర్లు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ అంటే ఇప్పటికీ మనందరికి జాంటీ రోడ్స్ (Jonty Rhodes) గుర్తుకొస్తాడు. తాజాగా సఫారీల జట్టులోనే ఓ కుర్రాడు కళ్లుచెదిరే క్యాచ్‌తో రోడ్స్‌ను గుర్తుకు చేశాడు.
Junior Jonty Rhodes : క్రికెట్ మైదానంలో పక్షిని తలపించేలా విన్యాసాలు చేస్తుంటారు కొందరు ఫీల్డర్లు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ అంటే ఇప్పటికీ మనందరికి జాంటీ రోడ్స్ (Jonty Rhodes) గుర్తుకొస్తాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆటగాడు అమాంతం గాల్లో తేలుతూ క్యాచ్‌లు పట్టడం, మెరుపు వేగంతో రనౌట్స్ చేసిన సందర్భాలు చాలానే. రోడ్స్ రిటైరయ్యాక అతడిలా ఫీల్డింగ్ చేసేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. తాజాగా సఫారీల జట్టులోనే ఓ కుర్రాడు కళ్లుచెదిరే క్యాచ్‌తో రోడ్స్‌ను గుర్తుకు చేశాడు.
రాంచీలో జరగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా యువకెరటం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) వండర్ బాయ్‌లా క్యాచ్ పట్టాడు. బార్ట్‌మన్ వేసిన 27వ ఓవర్ మూడో బంతికి భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్(8) బ్యాక్వర్డ్ పాయింట్లో షాట్ ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న బ్రెవిస్ బంతిని గమనించి కుడివైపు డైవ్ చేస్తూ ఒడుపుగా ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.
What a catch by Dewald Brevis !
Sabotaged the innings of his own IPL franchise CSK captain Ruturaj Gaikwad 😂#INDvSA #TeamIndia #RuturajGaikwad pic.twitter.com/AHd4LCUrD7
— Prateek (@prateek_295) November 30, 2025
నమ్మశక్యంకాని విధంగా అతడు పట్టిన ఆ క్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు జాంటీ రోడ్స్‌ను మరోసారి చూసిన ఫీలింగ్ ఇచ్చింది. స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న బ్రెవిస్ ఆ తర్వాత బంతిని గాల్లోకి విసరేసి సహచరులతో సంబురాలు చేసుకున్నాడు. గైక్వాడ్ ఔట్ కావడంతో 183 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

