Devon Thomas | దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు గాను వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఐదేండ్ల నిషేధం విధించింది. లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) 2021 సీజన్లో థామస్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అభియోగాలున్నాయి. సుదీర్ఘ విచారణ తర్వాత ఐసీసీ తాజాగా అతడిపై చర్యలకు ఉపక్రమించింది.