GG vs UPW : యూపీ వారియర్స్ (UP Warriorz) మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ దేవికా వైద్య (7) స్టంపౌట్ అయ్యింది. తనూజా కన్వర్ ఓవర్లో ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చింది. బంతిని అందుకున్న కీపర్ సుష్మా వర్మ వికెట్లను గిరాటేసింది. తహ్లియా మెక్‌గ్రాత్ (17), గ్రేస్ హ్యారిస్(0) క్రీజులో ఉన్నారు. దేవిక, మెక్‌గ్రాత్ మూడో వికెట్‌కు 20 రన్స్ జోడించారు. పవర్ ప్లేలో యూపీ 3 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో యూపీ జట్టు స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హిట్టర్ కిరణ్ నవగిరే (4), అలిసా హీలీ (12) వరుస ఓవర్లలో ఔటయ్యారు. కిమ్ గార్త్ ఓవర్లో షార్ట్ పిచ్ బంతికి కిరణ్ మిడాన్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది ఓపెనర్ హీలీ, మోనికా పటేల్ వేసిన రెండో ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడింది. బౌండరీ దగ్గర హర్లీన్ డియోల్ క్యాచ్ పట్టడంతో అలిసా వెనుదిరిగింది.