DC vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌లో యూపీ కీలక ప్లేయర్ గ్రేస్ హ్యారిస్‌తో పాటు ఓపెనర్ దేవికా వైద్య, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌కు విశ్రాంతినిచ్చింది. వాళ్ల ప్లేస్‌లో యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్ తుది జట్టులోకి వచ్చారు. ఢిల్లీ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఈ పోరులో ఢిల్లీ భారీ విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్.
యూపీ వారియర్స్ జట్టు : అలిసా హేలీ (కెప్టెన్), శ్వేతా షెరావత్, కిరణ్ నవగిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, సిమ్రాన్ షేక్, పర్షవీ చోప్రా, అంజలీ సర్వానీ, సొప్పదండి యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్.