లండన్: విండుల్డన్లో టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్న డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ ఆ క్రమంలో మరో అడుగు ముందుకేశాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ టాప్ సీడ్ ఇటలీ స్టార్ 7-5, 7-6 (7/4), 6-3తో యాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)ను ఓడించి టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచాడు.
ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ జ్వెరెవ్ 6-4, 7-5, 3-6, 7-6 (8/6)తో జిరి లెహెక (చెక్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు. మహిళల కోకో గాఫ్ (అమెరికా) 4-6, 6-3, 6-3తో తన దేశానికే చెందిన జెస్సికా పెగులాను ఓడించి లాస్ట్-4కు చేరుకుంది. మరో క్వార్టర్స్‌లో నవొమి ఒసాకా (జపాన్).. 6-7 (4/7), 4-6తో కరోలినా ముచోవా (చెక్) చేతిలో ఓడింది. ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం గాఫ్, ముచోవాకు ఇదే మొదటిసారి కావడం విశేషం.