న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యుఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ డేనియల్ మెద్వెదెవ్ ముందంజ వేశాడు. సోమవారం తొలి రౌండ్లో మెద్వెదెవ్ 6-2, 6-4, 6-0తో అమెరికా ఆటగాడు స్టిఫాన్ కొజ్లొవ్పై సునాయాసంగా గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మెద్వెదెవ్ ఏకంగా 10 ఏస్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు.
మరోమ్యాచ్‌లో 16వ సీడ్ రాబర్టొ బటిస్టా అగట్ ఓటమిపాలై తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. జెజె ఉల్ఫ్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బటిస్టా 4-6, 4-6, 4-6తో ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో అలెగ్జాండ్రొ టాబిలొ 6-1, 6-4, 7-6(3), 6-1తో కామిల్ మార్జక్పై, అలెగ్జాండ్రొ ఫొకినా 6-3, 7-5, 6-3తో యోషిహితొ నిషియోకపై విజయం సాధించారు.మహిళల విభాగంలో మూడో సీడ్ మరియ సక్కారి మూడు సెట్ల పోరులో 6-4, 3-6, 6-0తో తాత్యానా మరిపై గెలుపొంది రెండో రౌండ్లో ప్రవేశించింది.