DC vs RCB | ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోహ్లీసేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే పది విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇక చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన బెంగళూరు కూడా మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తున్నది.
ఇక సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాస్తవానికి ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ పోటీ నుంచి నిష్క్రమించాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య కేవలం నామమాత్రంగానే ఈ మ్యాచ్ జరుగుతున్నది.