లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3) నిరాశపరిచాడు. యువ పేసర్ మొహ్సిన్ ఖాన్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి వార్నర్ వెనుతిరిగాడు. వార్నర్ కొట్టిన బంతి ఆయుష్ బదోని వైపు చాలా తక్కువ ఎత్తులో వెళ్లింది. దాన్ని అతను అందుకున్నప్పటికీ బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు.
రీప్లే చూసిన తర్వాత బంతి కింద వేళ్లు ఉన్నాయని థర్డ్ అంపైర్ భావించి అవుట్ ఇచ్చాడు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయం తప్పని కొందరు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అక్కడ కనిపిస్తున్న దాన్ని బట్టి అవుట్ ఇవ్వకూడదని అభిప్రాయడ్డారు. కానీ అంపైర్ అవుట్ అని ప్రకటించడంతో వార్నర్ నిరాశగా పెవిలియన్ చేరాడు.