లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ (53 నాటౌట్) ఒక వైపు అదరగొడుతుంటే.. మరోవైపు మాత్రం అతనికి సహకరించే బ్యాటర్లు దొరకడం లేదు. కాసేపు డీకాక్‌కు తోడుగా నిలిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (24) కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విండీస్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ (5) మరోసారి నిరాశపరిచాడు.
లలిత్ యాదవ్ వేసిన 13వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఆఫ్‌స్టంప్ వైపు లలిత్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో టైమింగ్ మిస్ అయిన లూయిస్.. కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులతో నిలిచింది.