GG vs UPW : గుజరాత్ జెయింట్స్ మిడిలార్డర్ బ్యాటర్ దయలాన్ హేమలత (57) హాఫ్ సెంచరీ బాదింది. డబ్ల్యూపీఎల్‌లో ఆమె తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. దీప్తి శర్మ వేసిన 16వ ఓవర్లో సిక్స్ కొట్టి అర్ధ శతకానికి చేరువైంది. 32 బంతుల్లోనే ఆమె యాభై రన్స్ చేసింది. అష్ గార్డ్నర్(39), నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. దాంతో, 16 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి గుజరాత్ 143 పరుగులు చేసింది.
హేమలత స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడింది. సిక్స్‌లు, బౌండరీలు కొట్టింది. వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును వంద దాటించారు. 50 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ పడింది. 41 రన్స్ వద్ద ఓపెనర్ లారా వొల్వార్డ్ (17)ను అంజలీ సర్వానీ బౌల్డ్ చేసింది. సోఫీయా డంక్లెన్(23) వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వత వచ్చిన హర్లీన్ డియల్ (4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.