David Warner | ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఇక్కడ అభిమానులకు దగ్గరయ్యాడు. వార్నర్‌కు క్రికెట్ మాత్రమే కాదు.. ఇతర యాక్టివిటీలు కూడా ఎక్కువే. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన రీల్స్‌తో అభిమానులు ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ స్టార్ క్రికెటర్. కొత్త సినిమా వచ్చిందంటే చాలు అందులోని తనకు ఇష్టమైన డైలాగ్ లేదా పాటను అనుసరిస్తూ కుటుంబంతో కలిసి రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటాడు. తను పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులు వస్తుంటాయి. తాజాగా డేవిడ్.. ‘పఠాన్’లా మారిపోయాడు.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా, ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో షారుక్ ఫేస్ ప్లేస్‌లో వార్నర్ తన ఫొటోను రీప్లేస్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశాడు. దీనికి ‘వావ్ వాట్ ఏ ఫిల్మ్.. ఈ సినిమాకు పేరు పెట్టగలమా..? ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘డేవిడ్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే..’ ‘ఆస్కార్ గ్యారంటీ..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.