RCB vs CSK | సిక్సర్ల వర్షం కురిపించిన డేవిడ్, పాటిదార్.. ఐపీఎల్లో ఆర్సీబీదే రికార్డు స్కోర్..!
RCB vs CSK : అసలే చిన్న బౌండరీలుండే చిన్నస్వామి స్టేడియంలో టిమ్ డేవిడ్(70 నాటౌట్), రజత్ పాటిదార్(48 నాటౌట్)లు ధనాధన్ ఆటతో సిక్సర్ల వర్షం కురింపించారు.
RCB vs CSK : డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బ్యాటర్లు శివమెత్తిపోయారు. అసలే చిన్న బౌండరీలుండే చిన్నస్వామి స్టేడియంలో టిమ్ డేవిడ్(70 నాటౌట్), రజత్ పాటిదార్(48 నాటౌట్)లు ధనాధన్ ఆటతో సిక్సర్ల వర్షం కురింపించారు. అర్ధ శతకంతో దేవ్‌దత్ పడిక్కల్(50) భారీ స్కోర్‌కు బాటలు వేయగా.. డేవిడ్, పాటిదార్ జోడీ విధ్వంసాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది. డెత్ ఓవర్లలో సిక్సర్ల మీద సిక్సర్లు బాదిన ఈ జంట ఆర్సీబీకి 250 స్కోరందించింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోరవ్వడం విశేషం. బోణీ కోసం నిరీక్షిస్తున్న సూపర్ కింగ్స్ రికార్డు లక్ష్యాన్ని ఛేదించాల్సిందే అద్భుతం జరగాల్సిందే.
సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు పూనకాలు వచ్చినట్టే చెలరేగారు. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. దానికి రెండింతలు అన్నట్టు మిడిలార్డర్ బ్యాటర్లు సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల భరతం పట్టారు. ఫలితంగా ఈ సీజన్లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది ఆర్సీబీ. పవర్ ప్లేలోనే విరాట్ కోహ్లీ(28) ఔటైనా.. దేవ్‌దత్ పడిక్కల్(50) జతగా ఫిలిప్ సాల్ట్(46) స్కోర్ బోర్డును ఉరికించాడు.
Just absolute carnage out there in the middle! 🤯🔥
A ridiculous 21-ball fifty from Tim David 👏
Updates ▶️ https://t.co/PkhPvxcU44#TATAIPL | #KhelBindaas | #RCBvCSK pic.twitter.com/LA97b2Eqvn
— IndianPremierLeague (@IPL) April 5, 2026
అర్ధ శతకానికి చేరువైన సాల్ట్‌ను దూబే వెనక్కి పంపాడు. అనంతరం పడిక్కల్‌తో కెప్టెన్ రజత్ పాటిదార్(48 నాటౌట్) సూపర్ కింగ్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఓవర్టన్ ఓవర్లో స్కూప్ షాట్‌కు యత్నించిన పడిక్కల్ బౌల్డ్ అయ్యాడు. అయినా.. ఆర్సీబీ స్కోర్ వేగం తగ్గలేదు. చివరి ఐదు ఓవర్లలో టిమ్ డేవిడ్(70 నాటౌట్) ఆకాశమే హద్దుగా.. సిక్సర్లే సిక్సర్లు బాదేశాడు. 16వ ఓవర్ నుంచి మొదలైన అతడి దూకుడు చివరి ఓవర్ వరకూ కొనసాగింది. దాంతో.. ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Innings Break!#RCB post the highest total of #TATAIPL 2026 courtesy of an all-round batting effort 👏
Chase coming up shortly!
Updates ▶️ https://t.co/PkhPvxcU44#KhelBindaas | #RCBvCSK pic.twitter.com/EPrLbvRuPy
— IndianPremierLeague (@IPL) April 5, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

