IPL 2023, CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ బాదుడు.. ధోనీసేన టార్గెట్ 176
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం(చేపాక్ స్టేడియం) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 175 పరుగులు సాధించింది. దీంతో ధోని సేన విజయం సాధించడానికి 176 పరుగులు చేయాల్సి ఉంది.
IPL 2023, CSK Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం(చేపాక్ స్టేడియం) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు సాధించింది. దీంతో ధోని సేన విజయం సాధించడానికి 176 పరుగులు చేయాల్సి ఉంది.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్లు 26 మ్యాచుల్లో ముఖాముఖిగా పోటీపడ్డాయి. చెన్నై 15 సార్లు గెలుపొందగా, రాజస్థాన్ 11 మ్యాచుల్లో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లో ధోనీ సేనకు ఛేజింగ్ కష్టమేమీ కాకపోవచ్చు. చెన్నై తరఫున కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీకి ఇది 200వ మ్యాచ్ కావడం మరో విశేషం.
ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో జోస్ బట్లర్ 52 పరుగులు (36 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్స్‌లు) అత్యధిక పరుగులు చేశాడు. దేవ్‌దత్ పడిక్కల్ (38 పరుగులు, 26 బంతుల్లో, 5 ఫోర్లు) కూడా బ్యాట్ ఝుళింపించాడు. రవిచంద్రన్ అశ్విన్ 30 పరుగులు (22 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్స్‌లు) చేశాడు. చివర్లో హేట్మేయర్ (30 పరుగులు, 18 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
చెన్నై బౌలర్లలో రవీంద్రా జడేజా 2, ఆకాష్ సింగ్ 2, తుషార్ దేశ్పాండ్ 2 వికెట్లు తీశారు. స్పిన్నర్ మొయిన్ అలీ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యచ్ లో ధోని సేన ఫీల్డింగ్‌లో అదరగొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

