చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో గుజరాత్ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభమైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై.. కేవలం 133 పరుగులే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో సాహా (37 నాటౌట్), గిల్ (15 నాటౌట్) ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు.
ముఖ్యంగా సాహా అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ వస్తున్నాడు. అతను ఇచ్చిన క్యాచ్‌ను రుతురాజ్ వదిలేసిన తర్వాత మరింత రెచ్చిపోయిన సాహా.. ధాటిగా ఆడాడు. దీంతో గుజరాత్ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్లేమీ కోల్పోకుండా 53 పరుగులు చేసింది.