Cristiano Ronaldo | రొనాల్డో ఖాతాలో 63వ హ్యాట్రిక్ గోల్.. వీడియో చూశారా..!
Cristiano Ronaldo : ఫుట్‌బాల్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మైదానంలో ఎంత చురకుగా ఉంటాడో తెలిసిందే. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న అతను మరోసారి ఔరా అనిపించాడు. తాజాగా ఈ స్టార్ ఆటగాడు కెరీర్లో 63వ హ్యాట్రిక్(hat-trick goal) గోల్‌తో అభిమానులను ఫిదా చేశాడు. దాంతో దిగ్గజ ఆటగాడు పీలే(Pele) తర్వాత స్థానంలో....
Cristiano Ronaldo : ఫుట్‌బాల్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మైదానంలో ఎంత చురకుగా ఉంటాడో తెలిసిందే. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న అతను మరోసారి ఔరా అనిపించాడు. తాజాగా ఈ స్టార్ ఆటగాడు కెరీర్లో 63వ హ్యాట్రిక్(hat-trick goal) గోల్‌తో అభిమానులను ఫిదా చేశాడు. దాంతో దిగ్గజ ఆటగాడు పీలే(Pele) తర్వాత స్థానంలో నిలిచాడు.పీలే 92 సార్లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీ తరఫున రొనాల్డో నిన్న హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో నస్రీ జట్టు 5-0తో అల్ ఫతేహ్ జట్టుపై జరిగిన గెలుపొందింది.
ఈ ఏడాది ఆరంభంలో అల్ నస్రీ క్లబ్‌కు మారిన రొనాల్డో అద్భుత ఆటతో మైమరిపిస్తున్నాడు. అల్ ఫతేహ్(Al Fateh)పై అతను మరోసారి తన చాంపియన్ ఆటతో చెలరేగాడు. మొదట తలతో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. రెండో అర్ధ భాగంలో మరో గోల్ చేశాడు. ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా ఎడమ కాలితో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి హ్యాట్రిక్ గోల్ సాధించాడు.
ఆ తర్వాత నస్రీ జట్టు సభ్యలతో కలిసి సంబురాలు చేసుకున్నాడు. నిరుడు ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup 2022) సమయంలో రొనాల్డో, మాంచెస్టర్ యునైటెడ్(Manchester United) క్లబ్ మధ్య వివాదం చెలరేగింది. దాంతో, ఆ క్లబ్ ఈ స్టార్ ఆటగాడితో ఒప్పందం రద్దు చేసుకుంది. ఆ సమయంలో పలు క్లబ్స్ రొనాల్డోను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డాయి. చివరకు అల్ నస్రీ క్లబ్ రూ.4 వేల కోట్ల భారీ ధరకు అతడిని దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి
Prithvi Shaw | అమ్మాయిలకు దూరంగా ఉండు.. కోహ్లీలా ఫిట్‌గా అవ్వు.. పృథ్వీ షా ఏమన్నాడంటే..?
England T20 Squad | ఇంగ్లండ్ యువ పేసర్‌కు గాయం.. టీ20 జట్టులో క్రిస్ జోర్డాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

