తన ముందు ఉన్న కోలా బాటిల్స్ తీసి పక్కన పెట్టిన రొనాల్డో.. ఎందుకు?

బుడాపెస్ట్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో యూరో చాంపియన్‌షిప్‌లో మంగళవారం తన తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. హంగరీతో బుడాపెస్ట్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అతడు సోమవారం మీడియాతో మాట్లాడాడు. అయితే మీడియా సమావేశానికి వచ్చి కూర్చుంటున్న సమయంలో అతని ముందు రెండు కోకాకోలా బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూడగానే అతడు తీసి పక్కన పెట్టేశాడు. ఇది పక్కనే కూర్చున్న కోచ్ శాంటోస్తోపాటు మీడియాను కూడా ఆశ్చర్యపరిచింది. అతను ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాలేదు.
వెంటనే అతడే అసలు విషయాన్ని చెప్పాడు. కోలా బదులు నీళ్లు తాగండి అంటూ అక్కడే ఉన్న వాటర్ బాటిల్‌ను అతడు చూపించడం విశేషం. వరల్డ్‌లోని బెస్ట్ ఫుల్‌బాలర్స్‌లో ఒకడిగా ఎదిగిన రొనాల్డో.. ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి పెడతాడు. ఇప్పుడే కాదు జంక్ ఫుడ్‌ను మొదటి నుంచీ అతడు దూరం పెడతాడు. తన కొడుక్కి కూడా ఇలాంటి కోకా కోలాలు తాగకూడదు, జంక్ ఫుడ్ తినకూడదని తరచూ చెబుతుంటాడు. అయితే యూరో కప్ అనే కాదు కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు కోలాలాంటి డ్రింక్ కంపెనీలే స్పాన్సర్ చేస్తుంటాయి. వాటిని ప్లేయర్స్ మీడియా సమావేశాల్లోనూ ప్రదర్శించాలనుకుంటాయి. కానీ రొనాల్డోలాంటి స్టార్ ప్లేయరే పబ్లిగ్గా ఇలా కోలాలు వద్దని చెప్పడం అలాంటి కంపెనీలకు మింగుడుపడనిదే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

