Cristiano Ronaldo | గంటన్నరకే కోటి దాటిన సబ్‌స్ర్కైబర్లు.. యూట్యూబ్‌లో రొనాల్డో తుఫాను
ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో పెనుతుఫాను సృష్టిస్తున్నాడు. ఈ వేదికలోకి అరంగేట్రం చేసిన గంటల్లోపే రికార్డు స్థాయి ‘సబ్స్క్రిప్షన్స్'తో యూట్యూబ్ మోత మోగిపోతోంది.
- ఇప్పటికే డైమండ్ బటన్ సొంతం
- ‘మిస్టర్ బీస్ట్’ రికార్డులకు ఎసరు
Cristiano Ronaldo | మ్యాడ్రిడ్: ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో పెనుతుఫాను సృష్టిస్తున్నాడు. ఈ వేదికలోకి అరంగేట్రం చేసిన గంటల్లోపే రికార్డు స్థాయి ‘సబ్స్క్రిప్షన్స్’తో యూట్యూబ్ మోత మోగిపోతోంది. బుధవారం (ఆగస్టు 21) యూట్యూబ్‌లోకి ‘యువర్ క్రిస్టియానో’ అనే పేరుతో చానెల్‌ను క్రియేట్ చేసిన రొనాల్డో.. కేవలం 90 నిమిషాల్లోనే 10 మిలియన్ సబ్స్క్రిప్షన్స్ (కోటి మంది)ను దాటాడు. యూట్యూబ్ చరిత్రలో ఇంత వేగంగా 10 మిలియన్ సబ్‌స్ర్కైబర్స్‌ను దాటిన చానెల్ మరొకటి లేదు. దీంతో యూట్యూబ్ అతడికి ‘గోల్డెన్ బటన్’ను అందించింది.
ఇందుకు సంబంధించిన వీడియోనూ అతడు తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ ‘సూ’ను పోలినట్టుగా ‘థాంక్యూ సూ..బ్స్ర్కైబర్స్’ అని పోస్ట్ చేయగా అదీ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ చేసిన వీడియోతో యూట్యూబ్ అల్లకల్లోలమే అయింది. 12 గంటల్లోనే అతడి సబ్‌స్ర్కైబర్స్ సంఖ్య ఏకంగా 10 మిలియన్స్ (పది కోట్లు) దాటేసింది. యూట్యూబ్‌లో పది కోట్ల సబ్స్క్రిప్షన్స్ ఉన్న చానెల్‌కు ‘డైమండ్ బటన్’ను అందజేస్తారు.
ఇదిలా ఉండగా రొనాల్డో అభిమానుల దెబ్బకు ప్రముఖ అమెరికన్ ఇన్ఫ్లూయెన్సర్, వ్యాపారవేత్త అయిన మిస్టర్ బీస్ట్ యూట్యూబ్‌లో నమోదు చేసిన రికార్డులన్నీ చెల్లాచెదురవుతున్నాయి. 10 మిలియన్స్ సబ్స్క్రిప్షన్స్ అయ్యేందుకు బీస్ట్‌కు 132 రోజులు అవసరమైతే రొనాల్డో దానిని కేవలం 12 గంటల్లోనే అందుకున్నాడు. ప్రస్తుతం బీస్ట్‌ను 311 మిలియన్స్ (31.1 కోట్లు) మంది అనుసరిస్తుండగా రొనాల్డో (ఇప్పటికే 22 మిలియన్స్ దాటింది) అభిమానులు ఇదే ఊపు కొనసాగిస్తే మరికొన్ని గంటల్లోనే అతడు ఆ రికార్డునూ ఊదిపారేసే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

