న్యూఢిల్లీ: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై మెస్సి సేన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా మ్యాచ్‌ను కైవసం చేసుకున్నది. అయితే ఆ మ్యాచ్‌కు చెందిన కొన్ని క్షణాల వీడియోను క్రికెటర్ షమీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ వీడియోకు అతను ఇటీవల వివాదాస్పదమైన బేషరమ్ సాంగ్‌ను జోడించాడు. అర్జెంటీనా ప్లేయర్లు గోల్స్ చేస్తున్న వీడియోకు.. బ్యాక్‌గ్రౌండ్‌లో బేషరమ్ సాంగ్ మారుమోగింది. ఆ వీడియోకు అతను వావ్ అన్న క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే షమీ చేసిన ఆ పోస్టుపై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇది బెస్ట్ సాంగ్ సెలక్షన్ అని ఓ వ్యక్తి నవ్వుతూ కామెంట్ పెట్టాడు. పాటకు, గోల్‌కు సంబంధం ఏంటని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
షారూక్ నటించిన పఠాన్ చిత్రంలోని బేషరమ్ సాంగ్‌లో నటి దీపిక పదుకొనె కాషాయ దుస్తుల్లో స్కిన్ షో చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీపిక కాస్ట్యూమ్స్ సరిగా లేవన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు ఫిర్యాదు కూడా నమోదు అయ్యింది. కానీ ఆ వివాదాస్పద సాంగ్‌ను.. ఫుట్‌బాల్ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా షమీ జోడించి పోస్టు చేయడం చర్చానీయాంశమైంది.
Wowwwww pic.twitter.com/b42yTee9sS
— Mohammad Shami (@MdShami11) December 18, 2022