న్యూఢిల్లీ : హర్భజన్ అనగానే బంతిని సుడులు తిప్పుతూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే స్పిన్నర్‌గానే తెలుసు. అయితే ఇటీవల అతనిలోని మరో కోణం వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సభ్యుడైన హర్భజన్ ఒమన్‌లో 21 ఏళ్ల బాలికను ఆమె యజమానుల హింస నుంచి తప్పించాడు.
భటిండాకు చెందిన కమల్జిత్ కౌర్ అనే బాలికను ఆమె యజమానులు పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని తీవ్రంగా హింసిస్తున్న సంగతి తెలుసుకున్న హర్భజన్ ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయ అధికారుల సహాయంతో ఆ బాలికకు విముక్తి కల్పించాడు. ఒమన్‌లోని భారత దౌత్యాధికారుల సహకారం లేనిదే ఈ సాహసం పూర్తయేది కాదని హర్భజన్ వారిని ప్రశంసించాడు. ఒక బాధ్యతగల భారత పౌరునిగా తన విధిని తాను నిర్వర్తించానన్నాడు. హర్భజన్ చొరవతో ప్రస్తుతం ఆ బాలిక తమ స్వస్థలమైన బర్కండి గ్రామంలో తన తల్లితండ్రుల వద్దకు చేరుకుంది.