GT vs PBKS : పంతొమ్మిదో సీజన్లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఛేజింగ్ జట్టే విజేతగా నిలిచింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదిరే బోణీ కొట్టింది. బౌలర్ల విజృంభణతో గుజరాత్ టైటాన్స్‌ను కట్టడి చేసిన పంజాబ్‌ను కూపర్ కొన్నొల్లీ(74 నాటౌట్) ఒంటిచేత్తో గెలిపించాడు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(37) మెరుపులతో అలవోకగా లక్ష్యాన్ని అందుకునేలా కనిపించినా.. ఇంప్యాక్ట్ ప్లేయర్ ప్రసిధ్ కృష్ణ(3-29) వరుస వికెట్లతో భయపెట్టాడు. కానీ, చివరిదాకా నిలబడిన కూపర్.. గ్జావియర్ బార్ట్లెట్(11 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు.
పద్దెనిమిదో సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ విజయంతో పంతొమ్మిదో సీజన్‌ను మొదలెట్టింది. ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా కూపర్ కొన్నొల్లి(74 నాటౌట్) అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా చివరిదాకా నిలబడిన కూపర్ పంజాబ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. ముల్లన్‌పూర్‌లో గుజరాత్‌ను 162కే కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్‌కు కగిసో రబడ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(7) అశోక్ శర్మ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. 7 పరుగులకే వికెట్ పడిన వేళ కూపర్ కొన్నొల్లి() జతగా మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(37) లు దూకుడుగా ఆడాడు. రెండో వికెట్‌కు76 రన్స్ జోడించిన ఈ జంటను రషీద్ ఖాన్ విడదీశాడు.
Wicket off his very first ball 😎
Prasidh Krishna gets the big scalp of #PBKS Captain Shreyas Iyer ☝️
Updates ▶️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT | @gujarat_titans pic.twitter.com/L9YpgDIR0Z
— IndianPremierLeague (@IPL) March 31, 2026
ప్రభ్‌సిమ్రన్ ఔటయ్యాక వచ్చిన శ్రేయాస్ అయ్యర్(18), నేహల్ వధేరా(3)లు విఫలమయ్యారు. అప్పటికీ పంజాబ్ విజయానికి 42 బంతుల్లో యాభై రన్స్ అవసరమవ్వగా కొన్నొల్లి, శషాంక్ సింగ్()లు జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ ప్రసిధ్ కృష్ణ(3-29) తెలివైన బౌలింగ్‌తో వరుస బంతుల్లో శశాంక్, మార్కస్ స్టోయినిస్(0)ను ఔట్ చేయడంతో గుజరాత్ రేసులోకి వచ్చింది.
Leading the charge for @PunjabKingsIPL 💪
Cooper Connolly brings up his maiden #TATAIPL fifty on debut🔝#PBKS need 38 from 29 deliveries.
Updates ▶️ https://t.co/75rCxTCOL1#KhelBindaas | #PBKSvGT pic.twitter.com/PPPnlefD2N
— IndianPremierLeague (@IPL) March 31, 2026
రబడ ఓవర్లో కొన్నొల్లి రెండు ఫోర్లు బాదగా.. ప్రసిధ్ బౌలింగ్‌లో యాన్సెస్ సిక్సర్‌తో మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. ప్రసిధ్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని గ్జావియర్ బార్ట్లెట్(11 నాటౌట్) స్టాండ్స్‌లోకి గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరి ఓవర్లో 2 పరగులు అవసరమవ్వగా.. బౌండరీతో పంజాబ్‌కు 3 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు కూపర్.
గుజరాత్ టైటాన్స్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(13), శుభ్‌మన్ గిల్(39)లు రాణించినా.. సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి గుజరాత్ మిడిలార్డర్ తేలిపోయింది. సాయిని ఔట్ చేసిన యాన్సెన్ తొలి బ్రేకివ్వగా.. జోస్ బట్లర్(38)తో కలిసి గిల్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ, చాహల్ ఓవర్లో అతడు కొన్నొల్లి చేతికి చిక్కడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం గ్లెన్ ఫిలిప్స్(25) మెరుపు బ్యాటింగ్‌తో అలరించి స్కోర్‌బోర్డును ఉరికించాడు.

అయితే.. విజయ్‌కుమార్ ఓవర్లో అతడు అర్ష్‌దీప్ చేతికి చిక్కగా.. కాసేపటికే చాహల్ బౌలింగ్‌లో సిక్సర్‌కు యత్నించిన బట్లర్ బౌండరీ లైన్ వద్ద బార్ట్లెట్ పైకెగిరి క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బంతులు సంధించగా వాసింగ్టన్ సుందర్(18), షారుక్ ఖాన్(4), రాహుల్ తెవాటియా (11నాటౌట్)లు బౌండరీలు కొట్టేందుకు ఇబ్బంది పడ్డారు. చివరి ఓవర్లో అర్ష్‌దీప్ వైడ్స్ వేయడంతో గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేయగలిగింది.